Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Bhuvneshwar Kumar: గతంలో ఇలా జరగలేదు.. అందుకే ఇప్పుడు వికెట్లు పడుతున్నాయి, టెస్టుల్లోకి రమ్మంటారా?

 Bhuvneshwar Kumar Gave Clarity About His Swing, Injuries and Reentry in Tests

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టీ20లో రోహిత్ శర్మ నేతృత్వంలోని ఇండియా జట్టు 49పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి 2-0తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ 3ఓవర్లలో కేవలం 15రన్స్ మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను భారీ దెబ్బ తీశాడు. దీంతో అతను ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. భువీ తీసిన వికెట్లలో రెండు వికెట్లు పవర్‌ప్లేలో రావడం విశేషం.

ప్రమాదకర బట్లర్, రాయ్‌లను ఔట్ చేసి..

ప్రమాదకర బట్లర్, రాయ్‌లను ఔట్ చేసి..

ఇండియా విధించిన 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను భువీ ఆదిలోనే దెబ్బ కొట్టాడు. పవర్‌ప్లేలో జాసన్ రాయ్ (0)ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ పంపించిన భువీ.. కెప్టెన్ జోస్ బట్లర్‌‌ను కీపర్ క్యాచ్‌గా ఔట్ చేశాడు. దీంతో భారత్‌కు శుభారంభం దక్కింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం భువనేశ్వర్ కుమార్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. యూకేలో అతని స్వింగ్ బౌలింగ్, టెస్ట్ క్రికెట్ ఆడడం తదితర విషయాలను తెలియజెప్పాడు.

అదే నా బలం

అదే నా బలం

'నిజంగా చెప్పాలంటే.. బంతి ఇంత స్వింగ్ అవుతుందని నాకు తెలియదు. నేను చాలాసార్లు ఇంగ్లాండ్‌లో ఆడాను. అప్పట్లో బంతి ఇంత స్వింగ్ కాలేదు. అందువల్ల ఇప్పుడు ఇంతలా స్వింగ్ అవుతుండటం నాకు కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో వికెట్‌లో కూడా కొంచెం ఎక్కువ బౌన్స్ ఉంటుంది. అది కూడా కాస్త ప్లస్ అవుతుందేమో. బంతి స్వింగ్ అవుతుంటే నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. నిజాయితీగా చెప్పాలంటే నేను స్వింగ్ చేస్తున్నానో, లేక గ్రిప్ నుంచి విసిరేశాక బంతి ఆటోమేటిక్‌గా స్వింగ్ అవుతుందో మాత్రం నేను చెప్పలేను. ఏదేమైనా బంతి బాగా స్వింగ్ అవుతోంది. అదే నా బలం. కాబట్టి నేను తొలుత బ్యాటర్లపై అటాకింగ్ ఆప్షన్ బౌలింగే చేస్తున్నాను. బంతి స్వింగ్ అవ్వడం వల్లే రెండు మ్యాచ్‌లలో వికెట్లు తీయగలిగాను' అని భువీ చెప్పాడు.

ఫుల్ ఖుషీగా ఉన్నా

ఫుల్ ఖుషీగా ఉన్నా

'ఏదైనా సిరీస్‌కి వెళ్లినప్పుడు కచ్చితంగా గెలుస్తామని ఊహించుకుంటాం. మేము ప్రస్తుతం 2-0ఆధిక్యంలో ఉండడం పట్ల పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే మేము అన్ని రకాలుగా కష్టపడ్డాం. మేము సిరీస్ గెలిచామంటే క్రెడిట్ అంతా జట్టుకే చెందుతుంది. ఆటగాళ్లు, కాంబినేషన్లు మారవచ్చు కానీ స్పిరిట్ మాత్రం మారదు. ఇకపోతే ఓ ప్లేయర్‌గా నేను నా బౌలింగ్ విధానం పట్ల ప్రస్తుతం ఫుల్ ఖుషీగా ఉన్నాను. ఇంగ్లాండ్‌‌పై సిరీస్‌ను 3-0తో గెలిస్తే అది ఇంక కిక్కిస్తుంది.' అని భువీ చెప్పాడు. ఇక మీరు గతంలో గాయాల వల్ల చాలా ఇబ్బందిపడ్డారు.. ఇక మీ కెరీర్ ముగిసిపోతుందని ఆ టైంలో భావించారా అని భువీని విలేకరులు అడిగారు.

టెస్టు క్రికెట్‌కు రెడీగా ఉన్నా

టెస్టు క్రికెట్‌కు రెడీగా ఉన్నా

ఆ విషయమై భువీ స్పందిస్తూ.. 'నేను ఎప్పుడూ నా కెరీర్ ముగిసిపోతుందని అనుకోలేదు. అయితే ఆటకు దూరమైనప్పుడు కాస్త ఆత్మవిశ్వాసం కోల్పోయాను. కాస్త నిరాశకు కూడా గురయ్యాను. కానీ తప్పుకుండా తిరిగి రావాలనుకున్నా. మళ్లీ దేశం కోసం ఆడాలని సన్నద్ధమయ్యా. నిజాయితీగా నేను ఈ టైంలో ఇక దేని గురించి ఆలోచించడం లేదు.. నాకు ఎలాంటి అవకాశాలు లభించినా అందులో నేను బాగా రాణించడానికి ప్రయత్నించాలి. ఇకపోతే టెస్ట్ క్రికెట్ అంటారా.. టెస్ట్ జట్టులో చోటు దక్కితే నేనయితే వద్దు అని చెప్పను. కచ్చితంగా ఆడతాను. కానీ ఎంపిక అవ్వడం కాకపోవడాన్ని నేను డిసైడ్ చేయలేను. అందుకే ఆ విషయం గురించి ఆలోచించట్లేదు అని భువనేశ్వర్ చెప్పాడు.

Story first published: Sunday, July 10, 2022, 17:11 [IST]
Other articles published on Jul 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+