Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా రెండు ఓవర్లంటే మాటలా - పైగా ఓ వికెట్ - భువి ఆల్‌టైమ్ రికార్డ్

Bhuvneshwar Kumar creates record as a first bowler to bowl 2 consecutive maiden overs in T20Is

సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌ సూపర్ 12లో భాగంగా భారత్ తన రెండో మ్యాచ్ ఆడుతోంది. నెదర్లాండ్స్‌ను ఎదుర్కొంటోంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్‌లో మ్యాచ్ కొనసాగుతోంది. అందరూ ఆశించినట్టుగా టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ప్రారంభ ఓవర్లల్లోనే వికెట్‌ను కోల్పోయింది. మూడో ఓవర్‌లోనే వికెట్ పడింది. కేఎల్ రాహుల్ మరోసారి నిరాశ పరిచాడు. తక్కువ స్కోర్‌కే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఓపెనర్ కమ్ కేప్టెన్ రోహిత్ శర్మ, ఫస్ట్ డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. నిర్ణీత 20 ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ మరోసారి విఫలం అయ్యాడు. తొమ్మిది పరుగులకే అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ-53, విరాట్ కోహ్లీ-62, సూర్యకుమార్ యాదవ్-51 పరుగులు చేశారు. నెదర్లాండ్స్‌కు 180 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్ మాత్రమే ఒక్కో వికెట్ పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ తడబడుతోంది. లక్ష్యఛేదనలో ప్రారంభంలోనే చేతులెత్తేసింది. 10 ఓవర్లల్లో మూడు వికెట్లను కోల్పోయి 51 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ ఓపెనర్లు విక్రమ్‌జిత్ సింగ్-1, మ్యాక్స్ ఒడౌడ్-16, బాస్ డీ లీడె- 16 పరుగులు చేసి, అవుట్ అయ్యారు. కొలిన్ అక్కెర్‌మన్ -14, టామ్ కూపర్ -4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా బౌలర్లు భువనేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్ ప్రారంభంలోనే నెదర్లాండ్స్‌ను దెబ్బకొట్టారు. తమ బౌలింగ్ మేజిక్‌ను ప్రదర్శించారు.

ప్రత్యేకించి- భువనేశ్వర్ కుమార్ తన సత్తా ఏమిటో చాటాడు. రెండు ఓవర్లను వేసిన భువి ఒక్కటంటే ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఈ రెండు కూడా మెయిడెన్ ఓవర్లే అయ్యాయి. పైగా ఓ వికెట్ కూడా పడగొట్టాడు. అతను వేసిన 12 బంతుల్లో ఒక్క పరుగును కూడా రాబట్టుకోలేకపోయారు నెదర్లాండ్స్ బౌలర్లు. ఓ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో వరుసగా రెండు ఓవర్లను మెయిడెన్‌గా సంధించిన తొలి భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు భువనేశ్వర్ కుమార్.

Story first published: Thursday, October 27, 2022, 15:25 [IST]
Other articles published on Oct 27, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+