Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లీడ్స్‌లో మూడో వన్డే: నెట్స్‌లో భువీ 'నో బాల్, ట్విట్టర్‌లో జోకులు

Bhuvneshwar Kumar Bowls No Ball At Nets, Gets Trolled

హైదరాబాద్: టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌‌పై ట్విట్టర్‌లో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం కోహ్లీసేన ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. గాయంతో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్నాడు. మూడో వన్డేకు ముందు అతను నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు.

దీంతో సిరిస్‌ విజేత ఎవరో నిర్ణయించే నిర్ణయాత్మక మూడో వన్డేకు భువీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో భువనేశ్వర్ కుమార్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియోని బీసీసీఐ అభిమానుల కోసం ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఈ విషయం తెలిసి అభిమానులంతా సంతోషిస్తారని బోర్డు భావించింది.

అయితే, ఫ్యాన్స్ మాత్రం మరోలా స్పందించారు. ఆ వీడియోలో భువనేశ్వర్ నోబాల్ వేయడాన్నిగుర్తించిన అభిమానులు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. "అదో పెద్ద నోబాల్.. బౌలర్లు నెట్స్‌లో నోబాల్స్ వేస్తుంటే బౌలింగ్ కోచ్ ఏంచేస్తున్నాడంటూ" నెటిజన్లు ట్వీట్లతో ప్రశ్నిస్తున్నారు.

అయితే అభిమానులు ఇంతలా రియాక్ట్‌ అవడానికి కారణం ఉంది. మ్యాచ్‌లో బౌలర్ల తప్పిదం కారణంగా టీమిండియా భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తోంది. గతేడాది ఇంగ్లాండ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా వేసిన నో బాల్ ఎంత పని చేసిందో అందరికీ తెలిసిందే.

ఇక, భువీ నో బాల్‌పై అభిమానుల ట్రోలింగ్ ఎలా ఉన్నా.. మూడో వన్డేలో భువనేశ్వర్ కుమార్ తుది జట్టులో చోటు దక్కించుకుంటే అది జట్టుకు ఎంతో లాభిస్తుంది. భువీ రాకతో టీమిండియా బౌలింగ్ మరింత పటిష్టం కానుంది.

Story first published: Tuesday, July 17, 2018, 14:58 [IST]
Other articles published on Jul 17, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+