
బెంగళూరు: మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఆటగాడిని తిరిగి దక్కించుకుంది. టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను వేలంలో సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. మెగా వేలంలో 4 కోట్ల 20 లక్షల రూపాయలు వెచ్చించి దక్కించుకుంది. కాకపోతే గత సీజన్లో ఉన్న ధరలో సగం ధరకే దక్కించుకుంది. మెగా వేలంలో 2 కోట్ల రూపాయల కనీస ధరతో ఉన్న భువనేశ్వర్ కుమార్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడ్డాయి. అయితే చివరకు సన్‌రైజర్స్ హైదరాబాదే దక్కించుకుంది. గత సీజన్లో కూడా భువనేశ్వర్ కుమార్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫునే ఆడాడు. కానీ ఈ సారి ఆ జట్టు రిటెన్షన్ జాబితాలో భువికి చోటు కల్పించక పోయినప్పటికీ వేలంలో తిరిగి దక్కించుకుంది. అయితే గత సీజన్లో భువికి సన్‌రైజర్స్ 8 కోట్ల 50 లక్షల రూపాయలు చెల్లించింది. కానీ ప్రస్తుతం భువి ఫాంలో లేకపోవడంతో వేలంలో తక్కువ ధరకు తిరిగి దక్కించుకుంది. గతంలో కన్నా ప్రస్తుతం భువికి సగం ధర తక్కువగా వచ్చింది. అంటే 4 కోట్ల 30 లక్షల రూపాయలు తగ్గాయి.
కాగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు దక్కించుకున్న నాలుగో ఆటగాడు భువనేశ్వర్ కుమార్. మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే వాషింగ్టన్ సుందర్, టి.నటరాజన్, నికోలస్ పూరన్‌ను దక్కించుకుంది. అందులో అత్యధికంగా పూరన్‌ను ఏకంగా 10 కోట్ల 75 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. ఇక వాషింగ్టన్ సుందర్‌ను 8 కోట్ల 75 లక్షల రూపాయలకు, నటారాజన్‌ను 4 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. మెగా వేలంలో ఇప్పటివరకు అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఇషాన్ కిషన్ నిలిచాడు. కిషన్‌ను ముంబై ఇండియన్స్ 15 కోట్ల 25 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. ఆ తర్వాతి స్థానంలో శ్రేయస్ అయ్యార్ ఉన్నాడు. అయ్యర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ 12 కోట్ల 25 లక్షల రూపాయలకు దక్కించుకుంది. కాగా మెగా వేలం ఆదివారం కూడా కొనసాగనుంది.