
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జరిగిన తొలిటెస్టు పరాజయానికి విశ్లేషణలు వెల్లువలా వస్తున్నాయి. దానికి తగ్గట్టే బాగా రాణించిన వారికి ప్రశంసలు అలానే వస్తున్నాయి. ఈ క్రమంలో జట్టులో పాండ్యాను మినహాయించి కాస్తో కూస్తో బాగా ఆడారు అనిపించుకున్న వాళ్లు బౌలర్లు మాత్రమే.
వారిలో ఫేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఎక్కువ మార్కులు కొట్టేశాడు. అతని కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకును సాధించాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో మెరుగైన ప్రదర్శన చేసిన అతడు.. తాజా ర్యాంకింగ్స్‌లో ఎనిమిది స్థానాలను దాటుకుని 22వ స్థానానికి చేరుకున్నాడు.
మిగిలిన బౌలర్ల స్థానాలు ఇలా..:
జడేజా, అశ్విన్ మూడు, నాలుగో స్థానాల్లో కొనసాగుతున్నారు. కాగిసో రబాడ అగ్రస్థానంలో ఉన్నాడు. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో స్టార్ బ్యాట్స్ మెన్స్ సైతం తమ ర్యాంకును కోల్పోయారు.
బ్యాట్స్ మెన్ స్థానాలు అటు ఇటు:
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న హార్దిక్ పాండ్యా 24 స్థానాలు ఎగబాకి 49వ స్థానంలో నిలిచాడు. ఇక బ్యాట్స్ మెన్ ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. తాజా ర్యాంకింగ్స్‌లో కింగ్ కోహ్లీ ఒక స్థానాన్ని కోల్పోయి 880 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.