IND vs AFG : నేను ఇంతలా స్వింగ్ అవుతుందని అస్సలు ఊహించలేదు.. భువీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆసియా కప్ టోర్నీ ఫైనల్ అవకాశాన్ని చేజార్చుకున్న టీమిండియా సూపర్ 4లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఘన విజయంతో టోర్నీ ముగించిన సంగతి తెలిసిందే. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు హైలెట్ విషయాలు ఏంటంటే.. మూడేళ్ల తర్వాత కోహ్లీ సెంచరీ చేశాడు. రెండోది భువనేశ్వర్ కుమార్ తన కెరీర్ బెస్ట్ బౌలింగ్ కనబరిచాడు. తొలుత కోహ్లీ (122పరుగులు 61బంతుల్లో 12ఫోర్లు, 6సిక్సర్లు నాటౌట్), కేఎల్ రాహుల్ (62పరుగులు 41బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సులు) రాణించడంతో భారత్ 212పరుగులు చేసింది.

భువీ దెబ్బకు టాపార్డర్ ఢమాల్
తర్వాత 213పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘన్‌ను భువనేశ్వర్ కుమార్ ముచ్చెమటలు పట్టించాడు. తన 4ఓవర్ల కోటాలో కేవలం 4పరుగులు మాత్రమే ఇచ్చి 1మెయిడిన్ సహా 5వికెట్లు పడగొట్టాడు. భువీ దెబ్బకు ఆఫ్ఘన్ టాపార్డర్ బ్యాటర్లు క్రీజులో నిలబడాలంటేనే వణికారు. అతని దెబ్బకు ఓపెనర్లు హజ్రాతుల్లా జాజాయ్ (0), రహ్మనుల్లా గుర్బాజ్ (0) డకౌట్ అయ్యారు. కరీముల్లా జనత్ (2), నజీబుల్లా జాడ్రన్ (0), అజ్రతుల్లా (1) ఔటయ్యారు. భువీ దెబ్బకు ఆఫ్ఘన్ 21పరుగులకే 6వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక అప్పటికే మ్యాచ్ ఇండియా వశమైంది. అతనితోపాటు అర్షదీప్, హుడా, అశ్విన్ తలా ఓ వికెట్ తీసి ఆఫ్ఘాన్ పతనాన్ని శాసించారు. ఆఫ్ఘన్ బ్యాటర్లలో ఇబ్రహీం జార్డన్ (64పరుగులు 59బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) మినహా మరెవరూ రాణించలేదు. దీంతో 8వికెట్లకు 111పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 101పరుగుల భారీ తేడా విజయం భారత్ వశమైంది.

అస్సలు ఊహించలేదు
మ్యాచ్ అనంతరం భువీ మాట్లాడుతూ.. 'ఈ రోజు నాకు కలిసొచ్చింది. ఎందుకంటే పవర్‌ప్లేలో వికెట్లు వస్తే తప్పకుండా బాల్ నా గ్రిప్‌లో ఉన్నట్లే. వైట్ బాల్ పెద్దగా స్వింగ్ కాదు. కానీ ఈరోజు బంతి చాలా స్వింగ్ అయింది. నేను ఎక్కడ బౌలింగ్ చేసినా వికెట్లు పడ్డాయి. స్వింగ్ బాగా పడిందని నేను అనుకుంటున్నాను. గత రెండు మ్యాచ్‌లు పాకిస్తాన్‌తో, శ్రీలంకతో జరిగిన వాటిల్లో పెద్దగా స్వింగ్ రాలేదు. కానీ నేడు మామూలు స్వింగ్ కాలేదు. ఇది చాలా అనూహ్యమైంది. దీపక్ చాహర్ ఇప్పుడిప్పుడే గాయం నుంచి బయటపడ్డాడు. అతను బంతిని రెండు విధాలుగా స్వింగ్ చేయగలడు, అతనికి కొంత టైం కావాలి. ఇది మంచి టోర్నమెంట్. ఇది మాకు ప్రపంచ కప్‌కి ముందు మంచి సన్నాహకంగా ఉంటుంది.' అని భువీ పేర్కొన్నాడు.

తుది జట్లు :
భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(కెప్టెన్), కరీం జనత్, రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్, ఫాజుల్లా ఫారుఖీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications