For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కేప్‌టౌన్‌లో పాతికేళ్ల రికార్డుని సమం చేసిన భువనేశ్వర్

By Nageshwara Rao
Bhuvi Emulates Kapil, Picks up Wicket in 1st Over of a Test For First Time Since 1992

హైదరాబాద్: కేప్‌టౌన్ వేదికగా శుక్రవారం భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డుని సమం చేశాడు. కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భువనేశ్వర్ కుమార్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేశాడు.

ఇండియా vs దక్షిణాఫ్రికా 2018 తొలి టెస్టు స్కోరు కార్డు

తొలి ఓవర్ మూడో బంతికే భువనేశ్వర్ కుమార్ దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్‌ని డకౌట్‌గా పెవిలియన్‌కి పంపాడు. దీంతో దక్షిణాఫ్రికా పరుగుల ఖాతా తెరవకుండానే తొలి వికెట్‌ను కోల్పోయింది. టెస్టుల్లో విదేశీ గడ్డపై ఇలా ఓ భారత బౌలర్ తొలి ఓవర్‌లోనే వికెట్‌ తీయడం 1992 నుంచి ఇదే తొలిసారి.

గతంలో 1992-93లో దక్షిణాఫ్రికాతోనే జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ ఇన్నింగ్స్ తొలి బంతికే జిమ్మీ కుక్ వికెట్‌ తీశాడు. ఆ తర్వాత ఈ రికార్డుని ఇప్పటివరకు ఎవరూ అందుకోలేకపోయారు. కేప్‌టౌన్ టెస్టులో తొలి ఓవర్‌లో మూడో బంతికి సఫారీ ఓపెనర్‌ ఎల్గర్‌.. వికెట్‌ కీపర్‌ సాహాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

ఆ తర్వాత వేసిన మూడో ఓవర్‌ వేసిన భువనేశ్వర్ కుమార్... మర్క్రమ్ (5), ఐదో ఓవర్‌లో ఆమ్లా (3)ని పెవిలియన్‌కు పంపాడు. దీంతో 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, January 5, 2018, 18:49 [IST]
Other articles published on Jan 5, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+