For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ ప్రసార విషయమై ఎయిర్‌టెల్, జియోల మధ్య వివాదం

Bharti Airtel to comply with High Court order on disclaimer in IPL ad

హైదరాబాద్: ఐపీఎల్ ప్రసారాలపై ఎయిర్‌టెల్ వినియోగదారులను మోసం చేస్తోందంటూ జియో వాదిస్తోంది. ఈ క్రమంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కవరేజీ ప్రకటనలపై ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ సుప్రీం కోర్టుకు తెలిపింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం ముందు ఈ విధంగా పేర్కొంది.

లైవ్‌ అండ్‌ ఫ్రీ యాక్సెస్

లైవ్‌ అండ్‌ ఫ్రీ యాక్సెస్

ఎయిర్‌టెల్‌ ‘లైవ్‌ అండ్‌ ఫ్రీ యాక్సెస్' అంటూ ఐపీఎల్‌ కవరేజీపై ఇస్తున్న ప్రకటనల్లోనే దానికి వర్తించే షరతులను కూడా పెద్దవైన అక్షరాల్లో, అందరికీ వెంటనే కనిపించే ప్రదేశంలో ఇవ్వాలని కోరుతూ రిలయన్స్‌ జియో వేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ సందర్భంగానే హైకోర్టు ఆదేశాలు పాటిస్తామని ఎయిర్‌టెల్‌ తెలిపింది.

మొత్తానికి హాట్‌స్టార్‌ నుంచే ప్రత్యక్ష్య ప్రసారం

మొత్తానికి హాట్‌స్టార్‌ నుంచే ప్రత్యక్ష్య ప్రసారం

ఎయిర్‌టెల్‌ ప్రస్తుతం ‘సీజన్‌ పాస్‌..' ‘లైవ్‌ అండ్‌ ఫ్రీ యాక్సెస్‌' అంటూ ఐపీఎల్‌ ప్రకటనలు ఇస్తోంది. అయితే మొత్తానికి హాట్‌స్టార్‌ నుంచే ప్రత్యక్ష్య ప్రసారం ఉంటుంది. వీక్షణకు డేటా డౌన్‌లోడ్‌ ఛార్జీలు వర్తిస్తాయి. వీటిని ఎవరికీ కనిపించని విధంగా ప్రచురిస్తూ వినియోగదారులను ఎయిర్‌టెల్‌ మోసగిస్తోందని, తప్పుదోవ పట్టిస్తోందని జియో తొలుత హైకోర్టులో కేసు వేసింది.

యువతి చెప్పే సీజన్‌ పాస్‌ హై.. అనే వాయిస్‌

యువతి చెప్పే సీజన్‌ పాస్‌ హై.. అనే వాయిస్‌

ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఏకసభ్య హైకోర్టు ధర్మాసనం ప్రింట్‌ మీడియాలో 12 పిక్సెల్‌ పరిమాణంలో అక్షరాలను ముద్రించాలని, కనిపించేలా ఉండాలని, ప్రకటన కింది భాగంలో ఉండకూడదని మే 2న ఎయిర్‌టెల్‌ను ఆదేశించింది. వీడియో ప్రకటనలో యువతి చెప్పే సీజన్‌ పాస్‌ హై.. అనే వాయిస్‌కు తెరపై పడే అక్షరాలకు అనుగుణంగా ఉండాలని సూచించింది.

ఎయిర్‌టెల్‌ వాస్తవాలను దాచిపెడుతోందని

ఎయిర్‌టెల్‌ వాస్తవాలను దాచిపెడుతోందని

ఆ తర్వాత జరిగిన పరిణామాలను గోప్యంగా ఉంచి ఎయిర్‌ టెల్‌ మోసం చేస్తోందని జియో సుప్రీంలో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసింది. ఆ పిటిషన్‌లో న్యాయబద్ధత ఎంత ఉందా? అని, కొన్ని సందేహాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను తోసిపుచ్చడంతో జియో ఓడిపోయిందని ఎయిర్‌టెల్‌ ప్రచారం చేస్తుండగా కోర్టులో ఏం జరిగిందో చెప్పకుండా ఎయిర్‌టెల్‌ వాస్తవాలను దాచిపెడుతోందని జియో వాదిస్తోంది.

Story first published: Tuesday, May 22, 2018, 9:10 [IST]
Other articles published on May 22, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+