Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : షార్ట్ బాల్‌తో ప్లాన్ వేసిన గ్రీన్.. చుక్కలు చూపించిన భరత్.. వీడియో వైరల్!

Bharat two sixes for short balls video goes viral

ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో పిచ్ నుంచి బౌలర్లకు పెద్దగా సహకారం అందలేదు. ఈ క్రమంలో భారత బ్యాటర్ల వికెట్లు తీయడానికి ఆసీస్ బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ కేఎస్ భరత్ కూడా నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో చక్కగా ఆడాడు. జడేజా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అతను చూడచక్కని షాట్లతో అలరించాడు. అలాగే సాలిడ్ డిఫెన్స్‌తో తన స్కిల్స్ చూపించాడు.

ఈ క్రమంలోనే అతని వికెట్ తీసేందుకు ఆసీస్ కెప్టెన్ తెగ బౌలింగ్ మార్పులు చేశాడు. అయినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఇలాంటి సమయంలో 134వ ఓవర్లో ఆసీస్ యువ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను స్మిత్ బరిలో దింపాడు. అతను ఎలాగైనా భరత్‌ను అవుట్ చేయాలని ప్లాన్ వేశాడు. లెగ్ సైడ్ బౌండరీ వద్ద బలమైన ఫీల్డింగ్ ఏర్పాటు చేసి షార్ట్ బాల్స్‌తో భరత్‌ను బెంబేలెత్తించాలని అనుకున్నాడు. భరత్ కనుక పుల్ షాట్, హుక్ ఆడబోయి తడబడితే వికెట్ ఖాయమని డిసైడ్ అయ్యాడు. అయితే గ్రీన్ విసిరిన ఈ సవాల్‌ను భరత్ ధైర్యంగా స్వీకరించాడు.

అతను వేసిన రెండు షార్ట్ బాల్స్‌ను బౌండరీ లైన్ ఆవలకు పంపాడు. అతను ఇలా వరుసగా రెండు భారీ సిక్సర్లు బాదడంతో గ్రీన్ తెల్లమొఖం వేశాడు. ఆ తర్వాతి డెలివరీకి చక్కని కట్ షాట్‌తో ఫోర్ బాదాడు. ఇలా అతను వరుసగా బౌండరీలతో గ్రీన్‌కు చుక్కలు చూపించడంతో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులంతా సంతోషంతో కేరింతలు కొట్టారు. అప్పటి వరకు డిఫెన్స్ ఆట చూస్తూ ఉనన ఫ్యాన్స్‌కు అతని షాట్లు ఊపు తెచ్చాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన వద్ద ఉన్న అన్ని రకాల షాట్లను చూపించిన భరత్ ఈ ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేశాడు. ఆ తర్వాత లియాన్ వేసిన బంతికి డిఫెన్స్ ఆడబోయి అవుటయ్యాడు.

Story first published: Monday, March 13, 2023, 7:49 [IST]
Other articles published on Mar 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+