Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొత్త బాధ్యత: భారత్ మ్యాట్రిమోని బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని

Bharat Matrimony ropes in cricketer MS Dhoni as brand ambassador

హైదరాబాద్: ఆన్‌లైన్‌లో పెళ్లిసంబంధాలు కుదిర్చే పాపులర్‌ వెబ్‌సైట్‌ భారత్ మ్యాట్రిమోని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఇందుకు సంబంధించిన కార్యక్రమంలో సోమవారం చెన్నైలో జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా భారత్ మ్యాట్రిమోనితో చేసుకున్న ఒప్పందం గురించి ధోనితో పాటు ఆ సంస్థ సీఈఓ జానకిరామన్‌ సంయుక్తంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ "గత 18 ఏళ్లుగా ఎంతో మందికి తమ సహచర భాగస్వామిని ఎంపిక చేసుకోవటానికి భారత్‌ మ్యాట్రిమోని ఎంతగానో ఉపయోగపడింది" అని అన్నారు.

"లక్షల వివాహాలు జరిపించింది. వారు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. నిజాయితీగా పనిచేస్తున్నారు. అత్యంత నమ్మకమైన సంస్థతో పనిచేయడం ఆనందంగా, గర్వంగా ఉంది" అని అన్నారు. అనంతరం సంస్ధ సీఈఓ మురుగవేల్ జానకిరామన్‌ మాట్లాడారు.

"ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచిన ధోనితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. అతడి వివాహ జీవితం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. గొప్ప భర్తగా, బాధ్యత గల తండ్రిగా ధోని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు" అని తెలిపారు.

ధోని కమర్షియల్ ఎండార్స్‌మెంట్లను పర్యవేక్షిస్తోన్న స్పోర్ట్ మేనేజ్ మెంట్ కంపెనీ రితి స్పోర్ట్స్ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆదివారంతో ముగిసిన మూడు టీ20ల వెస్టిండిస్ సిరిస్‌తో పాటు నవంబర్ 21 నుంచి ఆసీస్‌తో జరిగే టీ20 సిరిస్ నుంచి కూడా ధోనిని తప్పించిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 12, 2018, 18:43 [IST]
Other articles published on Nov 12, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+