
నెట్ బౌలర్‌గా చూసి..
‘ఆర్సీబీ కోచ్‌గా ఉన్నప్పుడు సిరాజ్ నెట్ బౌలర్‌గా వచ్చాడు. అతను బాగా బౌలింగ్ చేస్తున్నాడని, హైదరాబాద్ జట్టుకు ఉపయోగించుకోవచ్చని సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో వీవీఎస్ లక్ష్మణ్‌కు చెప్పాను. కానీ ఆ ఏడాది సిరాజ్ పెద్దగా రాణించలేదు. సిజన్ చివరి దశలో కొన్ని అండర్ 22 మ్యాచ్‌లు ఆడాడు. కానీ అతను ఆట పట్ల గట్టి సంకల్పంతో పాటు ఆకలితో ఉన్నాడనే విషయం అర్థమైంది.

అదే దూకుడు..
నేను హైదరాబాద్ కోచ్‌గా చేరిన తర్వాత టీమ్ ప్రాబబుల్స్‌లో లేకున్నా సిరాజ్‌ను పిలిచాను. నేను సెలెక్ట్ కాలేదని, కానీ సాయశక్తుల కష్టపడతానన్నాడు. దాంతో మళ్లీ అతని బౌలింగ్‌ను పరీక్షించాను. అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆర్సీబీ నెట్‌బౌలర్‌గా అతనిలో కనిపించిన దూకుడే మళ్లీ నాకు కనిపించింది. ఇక సిరాజ్‌లో ఉన్న మరో మంచి విషయం ఏంటంటే.. అతను మనం కోరుకున్న విధంగా బౌలింగ్ చేయగలడు.

చివాట్లు తినడం ఇష్టం..
'సిరాజ్ కొన్నిసార్లు ప్రణాళికలకు దూరంగా బంతులేస్తాడు. అలాంటప్పుడు అతనిపై అరుస్తుంటాను. అది అతన్ని బాధపెట్టడం కాదు కానీ, అర్థమయ్యేలా చెప్పడం. నేను అలా చీవాట్లు పెడితే అతనికి ఇష్టం. నేను కోప్పడినప్పుడు సిరాజ్ చిన్నగా నవ్వి, ''ఓకే సర్, ప్రణాళిక ప్రకారమే బౌలింగ్ చేస్తా'' అని అంటాడు. తర్వాత అతను హైదరాబాద్ తరఫున రాణించి భారత్ ఏ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే, నేను టీమింయాకు వచ్చాక తరచూ నాతో మాట్లాడేవాడు. నన్నెందుకు పిలవట్లేదు సర్. నేను టీమిండియాకు ఆడాలనుకుంటున్నా'అని తనతో అనేవాడని భరత్ అరుణ్ చెప్పుకొచ్చాడు.
ఇక, సిరాజ్ ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. గబ్బా టెస్టులో 5 వికెట్లతో చెలరేగి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. తండ్రి మరణించినా జట్టు కోసం అక్కడే ఉన్నా సిరాజ్.. బాధను భరిస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.