కోచ్ నోట ఐదో బౌలర్ మాట: లార్డ్స్ టెస్టులో కుల్దీప్‌కు చోటు దక్కేనా?

హైదరాబాద్: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో టీమిండియా అదనపు బ్యాట్స్‌మన్‌తో ఆడడం కంటే ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలో దిగడమే మంచిదని భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తెలిపాడు.
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో గురువారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం భరత్ అరుణ్ మీడియాతో మాట్లాడుతూ ''లార్డ్స్‌లో అదనపు బ్యాట్స్‌మెన్‌తో బరిలో దిగడం మరీ సంప్రదాయ ఆలోచన" అని అన్నాడు.
"అయితే ప్రస్తుతం ఇక్కడి పిచ్ పరిస్థితులను బట్టి చూస్తే అదనపు బ్యాట్స్‌మెన్ కంటే అదనపు బౌలరే కీలకం అని అనుకుంటున్నా. బర్మింగ్‌హామ్‌లో జరిగిన తొలి టెస్టు మాదిరి ఈ పిచ్ కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో ఐదుగురు బౌలర్లను ఆడించడం మంచి వ్యూహం" అని అరుణ్ తెలిపాడు.
"తొలి టెస్టులో భారత బ్యాట్స్‌మన్ ఫ్రంట్ ఫుట్ షాట్లు ఆడడం సరైందే. ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ వాళ్లు ఇలాగే ఆడారు. దీని వల్ల అదనపు స్వింగ్‌ను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. బౌలర్ల విషయానికొస్తే తొలి టెస్టులో చాలా మెరుగ్గా బంతులేశారు. ఉమేశ్ చాలా వేగంగా బౌలింగ్ చేశాడు" అని పేర్కొన్నాడు.

పిచ్ పరిస్థితిని బట్టే తుది జట్టులో మార్పులు
"ఇక, పిచ్ పరిస్థితిని బట్టే తుది జట్టులో మార్పులుంటాయి. కుల్దీప్, జడేజా ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవడం కష్టమైన నిర్ణయం. తొలి టెస్టులో హార్దిక్ పాండ్యాకు తక్కువ బౌలింగ్ చేసే అవకాశం వచ్చిందంటే దాని అర్ధం మిగిలిన బౌలర్లందరూ అద్భుతంగా బౌలింగ్ చేశారు" అని అరుణ్ అన్నాడు.

తొలి టెస్టులో 31 పరుగుల తేడాతో ఓటమి
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన 31 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో లార్డ్స్ టెస్టుని కోహ్లీసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండో టెస్టు కోసం టీమిండియా లార్డ్స్‌కు చేరుకుంది. ఇందులో భాగంగా మంగళవారం భారత ఆటగాళ్లు లార్డ్స్ మైదానంలో సాధన చేశారు.

లార్డ్స్ పిచ్‌ను పరిశీలించిన రవిశాస్త్రి
ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆటగాళ్లందరూ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప్రాక్టీస్ చేశారు. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి లార్డ్స్ పిచ్‌ను పరిశీలించాడు. పిచ్ గురించి క్యూరేటర్‌ను అడిగి పూర్తి సమాచారం తెలుసుకున్నాడు. రెండో టెస్టులో టీమిండియా బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌పై జట్టు ప్రత్యేక దృష్టి సారించింది.

కుల్దీప్‌కు చోటు దక్కేనా?
చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో కనిపించడంతో రెండో టెస్టులో అతడికి చోటు దక్కుతుందేమోనని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మైదానంలో ఇప్పటి వరకు 17 టెస్టులాడిన టీమిండియా కేవలం రెండింట్లో మాత్రమే విజయాలను నమోదు చేసింది. మరోవైపు 11 టెస్టుల్లో ఓటమి పాలుకాగా, నాలుగు టెస్టులను డ్రాగా ముగించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications