
శ్రీలంక స్టార్ బ్యాటర్ భానుక రాజపక్స బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లాంటిదని పోల్చాడు. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లు ఎంత ఉద్విగ్నంగా, ఉత్కంఠగా సాగుతాయో అందరికీ తెలిసిందే. అలాగే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లు భారీ హైప్‌తో సాగుతాయి. ఇకపోతే నిన్న జరిగిన శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ అంతటి ఉత్కంఠను రేకెత్తించింది. ఈ మ్యాచ్‌కు ముందే ఇరు జట్ల మధ్య మాటల యుద్ధం సాగింది.. బంగ్లాదేశ్‌ను ఓడించడం ఈజీ అని శ్రీలంక కెప్టెన్ దసున్ షనక్ కామెంట్ చేయగా.. గ్రౌండ్లో చూసుకుందామంటూ బంగ్లా జట్టు డైరెక్టర్ మహమూద్ సవాల్ విసిరాడు. ఇక మ్యాచ్ మాత్రం నరాలు తెగే ఉత్కంఠతో సాగింది. ఇక చివర్లో జరిగిన హైడ్రామాలో శ్రీలంక గెలుపొందింది. దీంతో స్టాండ్స్‌లో శ్రీలంక ప్లేయర్లు 'నాగిని డ్యాన్స్'తో సంబరాలు చేసుకున్నారు.
'ఈ మ్యాచ్ భారత్-పాకిస్తాన్ ఆడినట్లు జరిగింది. బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు చాలా టఫ్ అండ్ టఫ్ ప్రత్యర్థులు. కానీ ఇరు జట్ల ప్లేయర్లం ఫీల్డ్ వెలుపల మంచి స్నేహితులం' అని రాజపక్స మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో తెలిపాడు. బంగ్లాదేశ్‌పై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించడం శ్రీలంక ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందన్నాడు. తాము ఈ మ్యాచ్ గెలవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నామని.. ఇలాంటి మ్యాచ్‌లలో గెలవడం చాలా ఉత్కంఠభరితంగా ఉంటుందని తెలిపాడు.
యుఏఈకి వచ్చినందుకు మా ఆటకు ఓ జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలనుకుంటున్నాం. ఈ టోర్నమెంట్ శ్రీలంకలో జరగాల్సింది.. కానీ దురదృష్టవశాత్తు మా దేశంలో కొనసాగించలేకపోయాం. ఏదేమైనా గత 12 నుంచి 15 నెలలుగా దాదాపు ఒకే టీం ఆటగాళ్లు జట్టులో ఉండడంతో టీం మేట్ల మధ్య కోఆర్డినేషన్, కమ్యూనికేషన్ మరింత మెరుగైంది అని రాజపక్స అన్నాడు.
బంగ్లాపై గెలుపుతో ఆసియాకప్ 2022లో శ్రీలంక జట్టు సూపర్-4లోకి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక సమష్టి ప్రదర్శనతో రాణించింది. ఆసాంతం అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 19.2ఓవర్లలో 8వికెట్లకు 184 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కుశాల్ మెండీస్(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) హాఫ్ సెంచరీ చేయగా.. డసన్ షనక(33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.