Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అనుష్కకు చహల్‌ విజ్ఞప్తి: వదినా మీరు చెప్పండి.. కోహ్లీ వింటాడు!!

Bhabhi, next time tell him Chahal se opening karwa le: Yuzvendra Chahal tells Anushka Sharma in Instagram reply

ఢిల్లీ: లాక్‌డౌన్‌ వేళ ఇంటికే పరిమితమైన టీమిండియా క్రికెటర్లు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నారు. ఒకవైపు అభిమానులకు కరోనాపై అవగాహన కల్పిస్తూనే.. మరోవైపు ఇంట్లో వారు చేసే సరదా పనులను నెట్టింట్లో పోస్టు చేసి అలరిస్తున్నారు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఆయన సతీమణి అనుష్క శర్మ సైతం లాక్‌డౌన్‌ వేళ సరదా పోస్టులతో ఆకట్టుకుంటున్నారు. ఇటీవల కోహ్లీ జుత్తు కత్తిరించిన అనుష్క.. తాజాగా అతడిని ఓ అభిమానిలా ఆట పట్టించింది.

 ఏయ్‌ కోహ్లీ.. చౌకా మార్‌:

ఏయ్‌ కోహ్లీ.. చౌకా మార్‌:

తాజాగా అనుష్క శర్మ ఇన్​స్టాగ్రామ్​లో ఓ వీడియో పోస్ట్ చేసింది. క్రికెట్‌కు దూరమైన విరాట్ కోహ్లీకి దాన్ని గుర్తుచేస్తూ ఫోర్‌ కొట్టూ అంటూ ఒకటే అల్లరి చేసింది. 'కోలీ (కోహ్లీ).. ఏయ్‌ కోలీ.. చౌకా మార్‌.. చౌకా.. కోలీ.. క్యా కర్రా' అంటూ సరదాగా ఏడిపించే యత్నం చేసింది. కాగా అనుష్క అల్లరికి కోహ్లీ బిత్తరచూపులు చూడటం తప్పితే చేసేదేమీ లేకపోయింది. అనుష్క మాటలకు ఒక్కసారిగా క్రికెట్‌ గుర్తుకు రావడంతో పేలగా చూస్తూ మౌనంగా ఉండిపోయాడు.

వదినా.. నన్ను ఓపెనర్‌గా పంపాలని చెప్పండి:

వదినా.. నన్ను ఓపెనర్‌గా పంపాలని చెప్పండి:

కోహ్లీకి సంబంధించిన వీడియోలను అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేయగా.. అది వైరల్‌గా మారింది. నెట్టింట్లో తెగ వైరల్‌ అయిన ఈ వీడియో ఒక్క రోజు వ్యవధిలో దాదాపు కోటి వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ వీడియోకు బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌నుంచి మొదలు అనేకమంది నటీనటులు రియాక్ట్‌ అయ్యారు. ఈ వీడియో చూసిన యుజువేంద్ర చహల్‌ వెంటనే సరదాగా స్పందించాడు. 'వదినా.. తర్వాతి వీడియోలో నన్ను ఓపెనర్‌గా పంపాలని చెప్పండి. కోహ్లీ మీ మాట వింటాడని ఆశిస్తున్నా' అంటూ సరదా వ్యాఖ్యలు చేశాడు.

గతంలో చాలాసార్లు సరదా వ్యాఖ్యలు:

గతంలో చాలాసార్లు సరదా వ్యాఖ్యలు:

గతంలో అనుష్కను ఉద్దేశించి చహల్‌ చాలాసార్లు సరదా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కోహ్లీకి జుత్తు కత్తిరించిన వీడియోలో.. అనుష్క కత్తెరతో కాకుండా ట్రిమ్మర్‌ ఉపయోగించి కోహ్లీ గడ్డాన్ని కత్తిరించాలని జోక్‌ చేశాడు. చహల్‌ స్వయం ప్రకటిత బ్యాట్స్‌మన్‌ అనే విషయం తెలిసిందే. తన బ్యాటింగ్‌ టెక్నిక్స్‌ కాపీ కొట్టారని, భారీ సిక్సర్లు కొట్టగలనని సరదాగా వ్యాఖ్యానిస్తుంటాడు. అయితే తనను ఏకంగా ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌గా పంపించే విధంగా కోహ్లీకి సిఫార్సు చేయాల్సిందిగా అనుష్కను అడగడం విశేషం.

హోటల్​లో ఉంటా గానీ ఇంటికి వెళ్లను:

హోటల్​లో ఉంటా గానీ ఇంటికి వెళ్లను:

మహమ్మారి కరోనా వైరస్‌ కారణంగా విధించిన ప్రస్తుత లాక్‌డౌన్‌లో కఠిన సమయాన్ని ఎదుర్కొంటున్నానని యుజువేంద్ర చహల్‌ ఇటీవల తెలిపాడు. ఇంతటి సుదీర్ఘమైన లాక్‌డౌన్‌ను ఎప్పుడూ చూడలేదని, నిద్ర కూడా సరిగా పట్టడం లేదన్నాడు. బౌలింగ్​ను తాను చాలా మిస్సవుతున్నానని, లాక్​డౌన్ ముగిసిన వెంటనే మైదానానికి వెళతానని చహల్‌ చెప్పుకొచ్చాడు. ఎప్పుడైతే లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారో ఇక ఇంటికి తిరిగి రానంటూ జోక్‌లు పేల్చాడు.

Story first published: Saturday, April 18, 2020, 14:05 [IST]
Other articles published on Apr 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+