Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

BGT సిరీస్‌ పిచ్ రేటింగ్స్ - దిగ్గజ క్రికెటర్ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఐసీసీ!

ఇటీవల ముగిసిన ఐదు మ్యాచుల బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీ సిరీస్‌ను ఆస్ట్రేలియా జట్టు 3-1తో దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఐదు టెస్టులకు సంబంధించిన పిచ్‌ రేటింగ్స్‌ను ఐసీసీ ప్రకటించింది. పెర్త్, అడిలైడ్ ఓవల్, గబ్బా, మెల్‌బోర్న్‌, సిడ్నీ పిచ్ లకు ఈ రేటింగ్స్ ను ఇచ్చింది.

పెర్త్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించి బోర్డర్ గావస్కర్ ట్రోఫీని గొప్పగా ప్రారంభించింది టీమ్ ఇండియా. అయితే ఆ తర్వాత అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో తడబడి సిరీస్‌ను కోల్పోయింది. అయితే ఈ టెస్ట్ మ్యాచులు జరిగిన వేదికల్లో సిడ్నీ పిచ్ పై బాగా విమర్శలు వచ్చాయి. సిడ్నీ పిచ్ పై ఆడిన ఐదో టెస్ట్ కేవలం 34 వికెట్లతో 3 రోజుల్లోనే ముగిసిపోయింది. దీంతో పిచ్ సరిగ్గా లేదంటూ చాలా మంది క్రికెట్ నిపుణులు విమర్శించారు. దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ కూడా సిడ్నీ పిచ్ సంతృప్తిగా లేదని అన్నాడు.

BGT Pitch Rating ICC Rate SCG Wicket For IND vs AUS Satisfactory Despite Being Labelled Not Ideal by Experts

కానీ ఐసీసీ మాత్రం సిడ్నీ పిచ్ కు 'సంతృప్తికరం' రేటింగ్ ను ఇచ్చింది. మిగతా నాలుగు వేదికల కన్నా ఎక్కువ రేటింగ్ సిడ్నీ పిచ్ కే ఇవ్వడం గమనార్హం. ఇక పెర్త్, అడిలైడ్ ఓవల్, గబ్బా, మెల్‌బోర్న్‌ పిచ్‌లకు 'వెరీ గుడ్' అని రేటింగ్ ఇచ్చింది ఐసీసీ. కాగా, అంతకుముందు పిచ్‌ రేటింగ్ విధానం ఆరు కేటగిరీలుగా ఉండేవి. 2023లో దీన్ని నాలుగుకు (వెరీ గుడ్, సంతృప్తికరం, అసంతృప్తికరం, అన్‌ఫిట్) కుదించారు.

పెర్త్, అడిలైడ్ ఓవల్, గబ్బా, మెల్‌బోర్న్‌ పిచ్‌లకు హైయెస్ట్ రేటింగ్ వచ్చింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ కూడా ఓ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసింది. దీనిపై హర్షం వ్యక్తం చేసింది. "మేం మాకు ఫేవర్ గా ఉండేలా పిచ్ లను సిద్ధం చేయము. బ్యాట్, బంతి, పిచ్ ల మధ్య మంచి పోటీ ఉండేలా, ఓ మంచి ఫలితం వచ్చేలా సిద్ధం చేస్తాం. ఈ పిచ్ లను సిద్ధం చేసేటప్పుడు వాతావరణం కీలక పాత్ర పోషిస్తుంది. కానీ నైపుణ్యం కలిగిన మా క్యూరేటర్స్ దాన్ని సవాల్ గా తీసుకుని పిచ్ లను తయారు చేస్తారు." అని చెప్పుకొచ్చింది.

Story first published: Wednesday, January 8, 2025, 16:16 [IST]
Other articles published on Jan 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+