Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

BGT 2024:ఓ వైపు వాన మ‌రోవైపు బీర్ గ్రిల్ చికెన్- ప్రేక్ష‌కుల మ‌జానే వేరు..!

భార‌త్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మూడ‌వ టెస్టు తొలిరోజు వ‌ర్షార్ప‌ణం అయిన సంగ‌తి తెలిసిందే. కేవ‌లం 80 బంతులు మాత్ర‌మే ప‌డ్డాయి. ఇక వ‌ర్షం కుర‌వ‌డంతో ఆట‌కు అంత‌రాయం క‌లిగింది. ప్లేయ‌ర్లు పెవీలియ‌న్ కు చేరారు. ప్లేయ‌ర్లు తిరిగి గ్రౌండ్ లోకి వ‌స్తారన్న ఆశ‌తో ఎదురు చూసిన ప్రేక్ష‌కుల‌కు నిరాశే మిగిలింది. అయితే అప్పుడ‌ప్పుడు రోహిత్ శ‌ర్మ మాత్రం బౌండ‌రీ లైన్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఆ త‌ర్వాత డ‌గౌట్ ఏరియాలో కూర్చున్నాడు.

స్టేడియంలో ఓ వైపు వ‌ర్షం కురుస్తుండ‌గా కెమెరా ఫోక‌స్ అంతా ఓ గుంపు మీద‌కు మ‌ర‌లింది. అక్క‌డ మాత్రం ఈ క్రేజీ క్రౌడ్ చ‌ల్ల‌టి బీర్ ను తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో ఆస్ట్రేలియా భార‌త్ కు చెందిన ప్రేక్ష‌కులున్నారు. బీర్ తో పాటు మంచింగ్ కు కూడా ఏదో స్ట‌ఫ్ వెంట తెచ్చుకున్నారు. ఇక వ‌రుణుడు ఎంత‌కు క‌రుణించ‌క‌పోవ‌డంతో వారి ఎంజాయ్ మెంట్లో వారు మునిగిపోయారు. ఇక వారాంతం కావ‌డంతో స్టేడియంకు మ్యాచ్ ను వీక్షించేందుకు కుటుంబాలుగా త‌ర‌లి వ‌చ్చారు. ఇదంతా ఇలా ఉంటే కెమెరా ఫోక‌స్ మాత్రం ఓ వ్య‌క్తిపైకి మ‌ళ్లింది.

BGT 2024-Grills Grit and grog How Gabba fans turned rain into a party

స్టేడియంలో చ‌ల్ల‌టి వాతావ‌ర‌ణం ఉండ‌గా.. ఆ వ్య‌క్తి మాత్రం ఏదో వండుతున్న‌ట్లుగా క‌నిపించింది. మాంసంను గ్రిల్ చేస్తున్నాడు. మాంసాన్ని ఎర్ర‌గా కాల్చి వాటికి సాస్ అంటిస్తుంటే చూసే వారికి నోరూ ఊరింది. ఇక ఆ మాంసం అలా గ్రిల్ అవుతోంది ఇలా ప్లేట్ల‌లో పెట్టి ఇచ్చేస్తున్నాడు. అక్క‌డికి వ‌చ్చిన ప్రేక్ష‌కులు లొట్ట‌లేసుకుని లాగించేశారు. అయితే వ‌ర్షం వ‌ల్ల ఆట ఆగింది కానీ ... త‌న వ్యాపారం మాత్రం క్లిక్ అయ్యింది. వ‌ర్షం ఆగుతుంద‌ని అని ఆశ‌తో ఎదురుచూసిన ప్రేక్ష‌కుల‌కు నిరాశ మిగిలింది కానీ.. ఆ స‌మ‌యంలో మాత్రం హాట్ హాట్ గ్రిల్డ్ చికెన్ తింటూ టైంపాస్ చేశారు.

ఓ చేతిలో బీర్ గ్లాస్, మ‌రో చేతిలో గ్రిల్ చికెన్ తో తెగ ఎంజాయ్ చేశారు. బ్రిస్బేన్ క్రికెట్ స్టేడియంలో శ‌నివారం రోజున క్రికెట్ కంటే ఇదే టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఇక స్టేడియంలో ప్రేక్ష‌కుల్లో చాలామంది ఈ గ్రిల్ చికెన్ కోసం క్యూక‌ట్టారు. ఇక వ‌ర్షం ఎక్కువ‌గా కురుస్తుండ‌టంతో ఆయ‌న దుకాణం కూడా క‌ట్టేయాల్సి వ‌చ్చింది. ఎవ‌రికైతే ఈ హాట్ గ్రిల్ చికెన్ దొర‌క‌లేదో వారు నిరాశ‌తో వెనుదిరిగారు.

ఇక మూడో టెస్టులో విరాట్ కోహ్లీ బ్యాటింగ్, బుమ్రా స్వింగ్ బౌలింగ్, ఫామ్ లోకి తిరిగి వ‌చ్చిన స్టీవ్ స్మిత్ ను చూసేందుకు వ‌చ్చారు. అస‌లే క్రిస్మ‌స్ సీజ‌న్ కావ‌డంతో స్టేడియం అంతా క‌ల‌ర్ఫుల్ గా క‌నిపించింది. వ‌ర్షం ప‌డుతుంద‌ని ముందుగానే తెలిసిన‌ప్ప‌టికీ ప్రేక్ష‌కులు మాత్రం ఆగిపోలేదు. అయితే అలా ప‌డి అలా ఆగిపోతుంద‌ని భావించారు. ఇక ఆదివారం కూడా ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తే బీర్లు, గ్రిల్ చికెన్ ఇంకాస్త ఎక్కువ‌గా కనిపిస్తాయి.

Story first published: Saturday, December 14, 2024, 18:30 [IST]
Other articles published on Dec 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+