Tilak Varma: తిలక్ వర్మ ఏ హీరో ఫ్యాన్ తెలుసా..ఆ ఫ్యాన్ బేస్ వర్మకు కలిసొచ్చిందిగా..!!
Tilak Varma:భారత యువ క్రికెటర్, హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ ప్రస్తుతం టీమిండియాలో అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతూ, ఆ తర్వాత టీ20, వన్డే ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించి తనదైన ముద్ర వేశాడు. ఈ యువ సంచలనం కేవలం క్రికెట్‌లోనే కాదు, సినిమా రంగంలోనూ ఒక పాన్ ఇండియా స్టార్‌కు వీరాభిమాని అని తాజాగా వెల్లడించారు.
ఓ ఇంటర్వ్యూలో తిలక్ వర్మకు ఇష్టమైన హీరో ఎవరు అని అడగగా,ఏమాత్రం ఆలోచించకుండా 'పాన్ ఇండియా స్టార్ ప్రభాస్' అని చెప్పారు. తనకు ప్రభాస్ అంటే చాలా అభిమానమని, ఆయన సినిమాలంటే చాలా ఇష్టమని తిలక్ వర్మ తెలిపారు.క్రికెట్‌లో దూసుకుపోతున్న ఈ యువ క్రికెటర్ నుంచి ప్రభాస్ పేరు వినడం అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది.

తిలక్ వర్మ కెరీర్ ముఖ్యాంశాలు
తిలక్ వర్మ కేవలం 21 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి తన సత్తా చాటాడు.
- ఐపీఎల్: 2022లో ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చిన తిలక్ వర్మ, తన అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. డెబ్యూ సీజన్‌లోనే 397 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు.
- అంతర్జాతీయ అరంగేట్రం: ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన కారణంగా 2023లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో భారత జట్టులోకి ఎంపికయ్యాడు. టీ20లలో అరంగేట్రం చేసిన మొదటి మ్యాచ్‌లోనే 39 పరుగులు చేసి తన సత్తా చాటాడు. ఆ తర్వాత ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ జట్టులో కూడా చోటు సంపాదించాడు.
- ఆట శైలి: ఆత్మవిశ్వాసంతో కూడిన బ్యాటింగ్, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం తిలక్ వర్మ బలం. భవిష్యత్తులో భారత క్రికెట్‌కు ఒక పెద్ద అసెట్‌గా మారే అవకాశాలున్నాయని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.
క్రికెట్ స్టార్‌గా ఎదుగుతున్న ఈ యంగ్ టాలెంట్ ప్రభాస్ అభిమాని కావడం సినీ, క్రీడా రంగాల అభిమానులను ఆకట్టుకుంది.అంతేకాదు ఎప్పుడైతే తిలక్ వర్మ తాను ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పాడో అప్పుడే సగం ప్రభాస్ ఫ్యాన్ బేస్ తిలక్ వర్మకు ఒకరకంగా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications