Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బెవాన్ or ధోని: వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ ఫినిషర్ ఎవరు?

Bevan or MS Dhoni – Michael Vaughan picks his preferred finisher in ODIs

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని.... అంతర్జాతీయ క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు. భారత్‌కు రెండు వరల్డ్ కప్‌లు అందించిన ఏకైక కెప్టెన్. బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ధోని... వికెట్ కీపర్‌గా కూడా అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

తాజాగా వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ ఫినిషర్ ఎవరు? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్... ధోని అని సమాధానమిచ్చాడు. ట్విట్టర్లో తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా వెల్లడించే వాన్.. ధోనిపై ప్రశంసల వర్షం కురిపించాడు.

'ఆస్క్ వాన్' పేరిట క్రికెట్ అభిమానులతో చాటింగ్ చేసిన ఈ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్.. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు. వన్డే క్రికెట్‌లో ధోని, ఆస్ట్రేలియా మాజీ హిట్టర్ మైకెల్ బెవాన్‌లలో ఎవరు బెస్ట్ ఫినిషరో చెప్పాలని ప్రశ్నించగా.. వెంటనే ఠక్కున ధోని అని సమాధానం ఇచ్చాడు.

'ఈ విషయంలో ఆలోచించడానికేం లేదు. ధోనీనే వన్డేల్లో అత్యుత్తమ ఫినిషర్' అని మైకెల్ వాన్ తెలిపాడు. ఈ మధ్య కాలంలో భారత క్రికెటర్లపై వాన్ తెగ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. సఫారీ గడ్డపై వరుసగా రెండు సిరిస్‌లను నెగ్గి చరిత్ర సృష్టించిన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని పొగుడుతూ పోస్టులు పెట్టాడు.

Story first published: Sunday, March 4, 2018, 10:56 [IST]
Other articles published on Mar 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+