Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : సూర్యను ఆడించడం కరెక్ట్ కాదు.. దాని కన్నా ఈ ఆప్షన్స్ బెటర్!

 Better options that debuting Suryakumar Yadav in BGT series

టీమిండియాకు కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సమయం దగ్గర పడింది. రెండు జట్లు ఈ ట్రోఫీ కోసమే కాదు.. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలన్నా ఈ సిరీస్ గెలవాల్సిందే. పలువురు కీలక ఆటగాళ్లు ఈ సిరీస్‌కు దూరమవడంతో సూర్యకుమార్ యాదవ్ టెస్టు అరంగేట్రం చేస్తాడని వార్తలు వస్తున్నాయి. కానీ సూర్యను టెస్టులు ఆడించడం అంత మంచి నిర్ణయం కాదని నిపుణులు అంటున్నారు. దానికి కారణాలు ఏంటంటే..

అనుభవం ఏది?

అనుభవం ఏది?

సూర్యకుమార్ యాదవ్‌కు టెస్టు క్రికెట్‌లో ఎలాంటి అనుభవం లేదు. అసలు ఆడితే కదా అనుభవం వచ్చేది అనే వాదన సరైందే కానీ.. ఇలాంటి కీలకమైన సిరీస్‌లో చాలా ముఖ్యమైన స్థానంలో సూర్యకు అవకాశం ఇవ్వడం అంత సబబు కాదు. టీ20ల్లో అద్భుతంగా రాణించే సూర్య.. వన్డేల్లోనే ఆ ఫలితాలను పునరావృతం చేయలేకపోయాడు.

అలాంటి వాడు టెస్టు క్రికెట్‌లో కష్టమైన స్థానంలో బ్యాటింగ్ చేస్తూ రాణించడం చాలా కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఇతర ఫార్మాట్లలో అద్భుతంగా రాణించిన చాలా మంది టెస్టుల్లో చేతులెత్తేసిన ఘటనలు చాలానే ఉన్నాయి కాబట్టి.

దేశవాళీ రికార్డులు చూస్తే..

దేశవాళీ రికార్డులు చూస్తే..

సాధారణంగా టీమిండియాలో అరంగేట్రం చేసే ఆటగాళ్ల దేశవాళీ రికార్డులు చాలా మెరుగ్గా ఉంటాయి. అయితే సూర్యకుమార్ ఫస్ట్ క్లాస్ రికార్డులు అంత గొప్పగా ఏం లేవు. టీమిండియాలో టెస్టు క్రికెట్ ఆడే బ్యాటర్లందరూ కూడా దేశవాళీల్లో 50పైగా సగటుతో పరుగులు చేసిన వాళ్లే. దీనికితోడు సర్ఫరాజ్ వంటి వాళ్లు కూడా భారీ సగటుతో టీమిండియాలో చోటు కోసం చూస్తున్నారు.

ఇక సూర్య రికార్డు చూస్తే.. మొత్తం 79 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన అతను 44.75 సగటుతో 5549 పరుగులు మాత్రమే చేశాడు. వీటిలో 14 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న వాళ్లందరిలో ఫస్ట్ క్లాస్ రికార్డు ఇంత ఘోరంగా ఉన్న ఆటగాడు సూర్య ఒక్కడే కావడం గమనార్హం. అంటే అతను తనకు దక్కిన ఆరంభాలను ఉపయోగించుకోవడంలో ఏమాత్రం సక్సెస్ కాలేకపోతున్నాడన్నమాట.

 ఇంకా మంచి ఆప్షన్లు..

ఇంకా మంచి ఆప్షన్లు..

శ్రేయాస్ అయ్యర్ లేకపోయినా.. సూర్యను జట్టులోకి తీసుకోకుండా మరొకరికి అవకాశం ఇచ్చే ఛాన్స్ కూడా టీమిండియా వద్ద ఉంది. టీమిండియాకు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అతన్ని మిడిలార్డర్‌లో ఆడించాలని ఎప్పటి నుంచో నిపుణులు సూచిస్తున్నారు. అయినా టీం మేనేజ్‌మెంట్ ఎప్పుడూ అతనితో ఈ ప్రయోగం చేయలేదు.

అలా చేయడానికి ఇదే మంచి సమయం కూడా. ఎందుకంటే ప్రస్తుతం గిల్ ఉన్న ఫామ్‌కు ఇప్పుడైతే అతను ఏ స్థానంలో అయినాా రాణించడం గ్యారంటీగా కనిపిస్తోంది. లేదంటే గిల్‌ను ఓపెనర్‌గా పంపి కేఎల్ రాహుల్‌ను మిడిలార్డర్‌లో పంపొచ్చు. వన్డేల్లో రాహుల్ ఈ స్థానంలోనే ఆడుతున్న సంగతి తెలిసిందే.

Story first published: Monday, February 6, 2023, 17:17 [IST]
Other articles published on Feb 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+