T20 World Cup: ప్రపంచకప్ ఆడిన జట్లలో బెస్ట్ 11 మంది ఆటగాళ్లు ఎవరంటే?

ఈ టీ20 ప్రపంచకప్‌లో చాలా జట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాయి. అయితే దురదృష్టవశాత్తూ ఓటములు కూడా చవిచూశాయి. ఈ క్రమంలో అన్ని జట్ల నుంచి అద్భుతంగా రాణించిన 11 మంది జట్టును ఎంపిక చేసుకుంటే.. ఎలా ఉంటుంది? ఈ ప్రపంచకప్ ఆడిన ఆటగాళ్లలో బెస్ట్ 11 మంది ఎవరెవరంటే..

ఓపెనర్లు బట్లర్, హేల్స్
ప్రపంచకప్‌లో జట్టుకు కావలసిన ధనాధన్ ఓపెనింగ్ అందించిన జోడీల్లో ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ జోడీ టాప్‌లో ఉంటుంది. ఈ టోర్నీలో వీళ్లిద్దరూ అద్భుతంగా రాణించారు. భారత్‌పై 168 పరుగుల లక్ష్యాన్ని వీళ్లిద్దరే ఛేజ్ చేసేసిన సంగతి తెలిసిందే. అలాగే కెప్టెన్‌గా కూడా బట్లర్ మంచి పరిణితి చూపించాడు. వికెట్ కీపింగ్ బాధ్యతలు బట్లర్ నిర్వహిస్తాడు.

మిడిలార్డర్‌లో ఇద్దరు ఇండియన్లు
ప్రపంచకప్‌లోని బెస్ట్ 11 మంది ఆటగాళ్లలో టీమిండియా నుంచి ఇద్దరు ఉన్నారు. ఏ జట్టుకైనా మిడిలార్డర్ ముఖ్యమే కదా. ఇక్కడ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ కన్నా బెటర్ ఆప్షన్లు ఏముంటాయి. ఆ తర్వాత కివీస్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ కూడా మిడిలార్డర్‌లో అదరగొట్టాడు. ఈ ముగ్గురూ మిడిలార్డర్‌లో ఉంటే ఆ జట్టుకు ఎలాంటి బెంగ ఉండదు.

ఆల్‌రౌండర్లు ఎక్కువ
ఆ తర్వాత కేటగిరీ ఆల్‌రౌండర్లు. ఈ పొట్టి ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్లు చాలా మంది సత్తా చాటారు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన శామ్ కర్రాన్, జింబాబ్వే స్టార్ సికందర్ రజా, పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్, శ్రీలంక స్టార్ వానిందు హసరంగ. ఇంతకు మించి ప్రమాదకరమైన ఆల్‌రౌండర్ల బృందం మరొకటి కనిపించదు.

చివరగా బౌలర్లు
ఏ జట్టుకైనా పేసర్లు బౌలింగ్‌లో ప్రధాన బలం. వీళ్లు తొలి పవర్‌ప్లేలో ప్రత్యర్థిపై ఒత్తిడి తెస్తారు. అలాగే డెత్ ఓవర్లలో అద్భుతమైన డెలివరీలతో ఆటగాళ్లకు భారీ షాట్లు ఆడే అవకాశం ఇవ్వరు. అందుకే ఈ స్థానంలో పాక్ పేసర్ షహీన్ అఫ్రిదీ, సౌతాఫ్రికా స్టార్ ఆన్రిచ్ నోర్యీని తీసుకున్నాం. ఇంతకన్నా బెటర్ జట్టు ఈ ప్రపంచకప్ ఆడిన ఆటగాళ్లలో ఉండదంటే అతిశయోక్తి కాదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications