For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్‌తో సిరిస్: చెన్నై టెస్టులో నమోదైన రికార్డులివే

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో పలు రికార్డులు నమోదయ్యాయి. ఐదో టెస్టు నాలుగో రోజు ఆటలో భాగంగా కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో పలు రికార్డులు నమోదయ్యాయి. ఐదో టెస్టు నాలుగో రోజు ఆటలో భాగంగా కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. 381 బంతుల్లో 32 ఫోర్లు 4 సిక్సర్ల సాయంతో 303 నాటౌట్‌గా నిలిచి సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌‌మన్‌‌గా రికార్డు నెలకొల్పాడు.

చెలరేగాడు: యంగెస్ట్ క్రికెటర్‌గా కరుణ్ నాయర్ చరిత్ర

ఓవర్‌నైట్‌ స్కోరు 71తో ఇన్నింగ్స్‌ కొనసాగించిన కరుణ్ నాయర్‌ సోమవారం ఒక్కరోజే 232 పరుగులు జోడించాడు. తద్వారా ట్రిపుల్ సెంచరీ సాధించిన యంగెస్ట్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో సాధించిన తొలి సెంచ‌రీనే ట్రిపుల్ సెంచరీగా మ‌ల‌చిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా కరుణ్ నాయర్ చరిత్ర సృష్టించాడు.

Best knock of my life, says triple centurion Karun Nair

టెస్టు క్రికెట్ చరిత్రలో గ్యారీ సోబర్స్ (365 నాటౌట్‌), బాబ్ సింప్సన్ (311) తర్వాత తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మార్చిన మూడో ప్లేయర్ కరుణ్ నాయర్ కావడం గమనార్హం. ఐదో టెస్టులో నాయర్ మరో అరుదైన ఘనతను సాధించాడు. ఒక మ్యాచ్‌లో ఐదు అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించిన ఆటగాడిగా నాయర్ నిలిచాడు.

303 నాటౌట్: కరుణ్ నాయర్‌కు సెహ్వాగ్ ట్రేడ్ మార్క్ ట్వీట్

ఈ టెస్టులో నాయర్ 225 పరుగుల వ్యక్తిగత పరుగులను దాటిన క్రమంలో ధోని రికార్డును బ్రేక్ చేశాడు. కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించడంతో టీమిండియా కూడా టెస్టుల్లో అత్యధిక స్కోరుని నమోదు చేసింది. ఈ క్రమంలో చెన్నై టెస్టులో నమోదైన పలు రికార్డులివే.

చెన్నై టెస్టులో నమోదైన రికార్డులు:

* టెస్టుల్లో తొలి సెంచరీని ట్రిపుల్ సెంచరీగా మలచిన తొలి భారత క్రికెటర్ కరుణ్ నాయర్.

* టిపుల్ సెంచరీ సాధించిన అతిపిన్న వయస్సు (25 ఏళ్ల 13 రోజులు) భారత బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్.

* ఇంగ్లండ్‌పై ట్రిపుల్‌ సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా కరుణ్‌ రికార్డు సృష్టించాడు.

* టెస్టుల్లో ట్రిపుల్ సాధించిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా కరుణ్ రికార్డు సృష్టించాడు. గతంలో సెహ్వాగ్‌ రెండుసార్లు ఈ ఘనత సాధించాడు.

* తొలి ట్రిపుల్ సెంచరీ సాధించడానికి కరుణ్ మూడు ఇన్నింగ్స్‌లు ఆడాడు. టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటివరకు ఇదే అత్యుత్తమం.

* గతంలో లెన్‌హటన్ 9 ఇన్నింగ్స్‌ల్లో, బ్రాడ్‌మన్ 13 ఇన్నింగ్స్‌ల్లో ట్రిపుల్ సెంచరీని సాధించారు.

* 759/7: ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌లో కోహ్లసేన చేసిన ఈ స్కోరే భారత్‌కు టెస్టుల్లో అత్యుత్తమం. గతంలో(2009) శ్రీలంకపై (726/9 డిక్లేర్డ్) ఇప్పటివరకు ఉన్న అత్యుత్తమ రికార్డు.

* ఒక సిరీస్‌లో 300 పైచిలుకు పరుగులు, 25 వికెట్లు పడగొట్టిన తొలి భారత ఆటగాడిగా అశ్విన్‌ రికార్డు నెలకొల్పాడు.

* 1248: చెన్నై టెస్టులో ఇప్పటివరకూ నమోదైన మొత్తం పరుగులివి.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+