Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2017: క్రికెట్‌లో అత్యుత్తమ ట్వీట్స్ ఇవే

హైదరాబాద్: సోషల్ మీడియా... అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే వేదిక. సోషల్‌మీడియా వేదికలైనా ఫేస్‌బుక్, ఇనిస్టాగ్రామ్, ట్విట్టర్‌ వచ్చిన తర్వాత ఒక్క ట్వీట్‌ లేదా పోస్ట్‌తో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వేదికలు క్రికెటర్లను తమ అభిమానులకు మరింత చేరువయ్యేలా చేశాయనడంలో ఎటువంటి సందేహాం లేదు. ప్రతి విషయాన్ని ఒక్క ట్వీట్‌తో తెలియజేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

అభిమానుల సైతం తమ భావాలను రీట్వీట్ల రూపంలో క్రికెటర్లకు తెలియజేసేందుకు ఇవి సరైన వేదికలుగా ఉపయోగపడుతున్నాయి. అయితే ఈ ఏడాది ట్విట్టర్‌లో ట్రెండ్ అయిన కొన్ని ట్వీట్ల గురించి తెలుసుకుందాం. మహేంద్ర సింగ్ ధోని అనూహ్యంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పుడు కోహ్లీ చేసిన ట్వీట్‌, న్యూజిలాండ్‌ క్రికెటర్‌ రాస్‌ టేలర్‌, టీమిండియా డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ల మధ్య జరిగిన ధర్జీ సంభాషణ ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

వీటితో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్‌ కుమారుడితో దిగిన ఫోటోపై జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్ధేశాయ్‌ చేసిన ట్వీట్‌ ఎంత పెద్ద వైరల్ అయిందో చెప్పాల్సిన పని లేదు. ఇక, మహిళా క్రికెటర్‌ జులన్‌ గోస్వామి, పాక్‌ మహిళా క్రికెటర్‌తో దిగిన ఫోటో అభిమానులను ఆకట్టుకుంది.

భారత పర్యటనలో భాగంగా అస్సాంలో ఆస్ట్రేలియా క్రికెటర్ల బస్సుపై రాయి దాడి జరిగినప్పుడు ఆ దేశ క్రికెటర్‌ హెన్రీక్స్‌ చేసిన ట్వీట్‌.. తలా ఈజ్ బ్యాక్ అంటూ ధోనితో ఉన్న ఫోటోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేసిన ట్వీట్‌ సైతం వైరల్ అయింది. ఈ ఏడాది చివర్లో విరుష్క పెళ్లి ప్రకటన ట్వీట్‌ ఏకంగా ఈ సంవత్సరంలో గోల్డెన్‌ ట్వీట్‌గా నిలిచింది.

నువ్వేప్పుడు మా నాయకుడివే

‘చుట్టూ కుర్రాళ్లను కోరుకునే నాయకుడికి ధన్యవాదాలు. నువ్వేప్పుడు మా నాయకుడివే ధోని భాయ్‌' - విరాట్ కోహ్లీ

సర్ఫరాజ్‌ కుమారుడితో ధోని

‘చాంఫియన్స్‌ ట్రోఫీలో అద్భుత చిత్రం. దేశాలకతీతంగా సర్ఫరాజ్‌ కుమారుడితో ధోని' - రాజ్‌దీప్‌ సర్ధేశాయ్‌

స్ఫిరిట్ ఆఫ్ క్రికెట్

‘మహిళల ప్రపంచకప్‌లో అద్భుత క్రీడా స్పూర్తి.. తన రోల్‌మోడల్‌ గోస్వామితో పాక్‌ ప్లేయర్‌' - ఐసీసీ

ఆసీస్ బస్సుపై దాడి

'బస్సుపై జరిగిన దాడి ఆదర్శంగా లేదు. కానీ భారత అభిమానులు, అస్సాం యువకులు మాకు మద్దిత్వడం సంతోషంగా ఉంది' - హెన్రీక్స్‌

టేలర్ - సెహ్వాగ్‌ల మధ్య దర్జీ సంభాషణ

‘బాగా ఆడావూ.. ధర్జీజీ (టేలర్‌‌ని కాస్త టైలర్‌‌గా మార్చి‌).. దీపావళి సీజన్‌ ఆర్డర్‌ ఒత్తిడిలో సైతం బానే ప్రయత్నించావు' - వీరేంద్ర సేహ్వాగ్‌

చెన్నై ఈజ్ బ్యాక్

‘సింహాల అరుపులు మొదలయ్యాయి.. జట్టులోకి ఎవరుస్తున్నారో ఊహించండి'- చెన్నైసూపర్‌ కింగ్స్‌

కోహ్లీ-అనుష్కల పెళ్లి

‘మేమిద్దరం కలకాలం కలిసుంటామనే పెళ్లి ప్రమాణం చేశాం. ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషుల ప్రేమాభిమానాలతో ఈ అందమైన రోజు మాకెంతో ప్రత్యేకం. మా పెళ్లి ప్రయాణంలో శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు' - ట్విట్టర్‌లో కోహ్లీ, అనుష్క శర్మ

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 1, 2018, 13:03 [IST]
Other articles published on Jan 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+