ఈ సీజన్లో బెస్ట్ బ్యాటింగ్, బెస్ట్ బౌలింగ్ జట్ల మధ్య పోరు.. ఆడేది ఎవరు, గెలిచేది ఎవరు?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో శనివారం రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం గుజరాత్ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుండగా.. రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో రాత్రి 7.30కు ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ ఐపీఎల్లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన సన్ రైజర్స్ తరువాత వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి పూర్తి ఉత్సాహంతో ఉంది. పాయింట్ల పట్టికలో 8పాయింట్లతో 5వ స్థానంలో ఉంది.
కానీ సన్‌రైజర్స్ నెట్ రన్‌రేట్ మాత్రం (-0.077)తో నెగెటివ్‌లో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో మరింత ముందుకు పోవాలని చూస్తుంది. సన్ రైజర్స్ నెట్ రన్‌రేట్ ప్లస్‌లో పడాలంటే మాత్రం.. భారీ తేడాతో విజయాలు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతుంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో రెండింట్లో ఓడి ఐదింట్లో గెలుపొందింది. పాయింట్ల పట్టికలో 10పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఆర్సీబీ నెట్ రన్‌రేట్ కూడా (+0.251) సూపర్‌గా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే నంబర్ 1 ప్లేస్‌కు చేరుకునే అవకాశం కూడా ఉంది.

భీకరమైన ఆర్సీబీ బ్యాటింగ్.. దానికి తగ్గట్టు ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్
కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ లాంటి స్టార్ బ్యాటర్లతో ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. దానికి తగ్గట్టు భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ లాంటి బలమైన బౌలింగ్ లైనప్ సన్‌రైజర్స్‌కు ఉంది. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ డుప్లెసిస్, కోహ్లిలపై తన స్వింగ్ ప్రదర్శించడానికి సిద్ధం కాగా.. ఉమ్రాన్ మాలిక్, నటరాజన్.. తమ పదునైన పేస్ యార్కర్లతో మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్‌లను ఎదుర్కోనున్నారు.
కోహ్లీ మినహా గొప్ప ఫామ్‌లో ఉన్న ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేయడానికి సన్ రైజర్స్ తనదైన వ్యూహాలు పన్నాల్సిన అవసరముంది. ఎప్పుడైన కోహ్లీ తన ఫామ్ అందుకునే వీలుంది. అదే జరిగితే ఆర్సీబీని ఆపడం ఏ బౌలర్ తరం కాదు.

సన్ రైజర్స్ బ్యాటర్లకు అగ్ని పరీక్షే..
ఈ ఏడాది ఆర్సీబీ తరఫున ఆడిన రెండు మ్యాచ్‌లలో 7వికెట్లు తీసి సూపర్ ఫామ్‌లో ఉన్న జోష్ హేజిల్‌వుడ్.. ఆర్సీబీకి బౌలింగ్లో ప్రధాన అస్త్రం కానున్నాడు. ఓపెనర్లు కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మల పని పట్టేందుకు అతను తన పేస్ మాయాజాలాన్ని ప్రదర్శించే వీలుంది.
ఇక డెత్ స్పెషలిస్టు హర్షల్ పటేల్, స్పిన్నర్ వనిందు హసరంగా, లైన్ అండ్ లెంత్ బౌలర్ సిరాజ్ లాంటి బౌలర్లను ఎదుర్కోవడం సన్ రైజర్ బ్యాటర్లకు అగ్ని పరీక్షే అని చెప్పాలి. అయితే మంచి ఫామ్‌లో ఉన్న రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్.. ఆర్సీబీ బౌలింగ్ ఎటాక్‌ను తిప్పికొట్టగల సమర్థులని చెప్పొచ్చు.

తుది జట్ల అంచనా..
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, జె సుచిత్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, టి.నటరాజన్, ఉమ్రాన్ మాలిక్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాబబుల్ ప్లేయింగ్ 11 : విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, సుయాష్ ప్రభుదేసాయి, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్, వనిందు హసరంగా, జోష్ హేజిల్‌వుడ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications