ఈ ప్రపంచకప్‌లో అభిమానులు మెచ్చిన ఆల్‌రౌండర్లు వీళ్లే!

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. శనివారం(June 21st) నాటికి 10 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా... 9 పాయింట్లతో న్యూజిలాండ్ రెండో స్థానంలో... 8 పాయింట్లతో ఇంగ్లాండ్ మూడో స్థానంలో... 7 పాయింట్లతో టీమిండియా నాలుగో స్థానంలో ఉంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అయితే, ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో టాపార్డర్ బ్యాట్స్‌మన్‌తో పాటు ఆల్ రౌండర్లు కూడా ఆయా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో పలువురు ఆల్ రౌండర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. వారెవరో ఒక్కసారి చూద్దాం...

హార్ధిక్ పాండ్యా
ఈ ప్రపంచకప్‌లో టీమిండియా తరుపున అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటివరకు భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌లకు గాను పాండ్యా 3 ఇన్నింగ్సుల్లో 89 పరుగులు చేశాడు. భారత జట్టులో అత్యధిక స్ట్రైక్‌రేట్ 167 పాండ్యాదే కావడం విశేషం. బౌలింగ్‌లో మెరుపులు మెరిపించలేకపోయినప్పటికీ బ్యాటింగ్‌లో మాత్రం ఇరగదీస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లోనే 48 పరుగులు చేయడంతో భారత్ స్కోరుని 300 దాటించడంతో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రపంచకప్‌లో భారత విజయాల్లో పాండ్యా పాత్ర ఎంతీ కీలకం కానుంది.

బెన్ స్టోక్స్
ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో బెన్‌స్టోక్స్ ఒకడు. అటు బౌలింగ్‌తోనే కాదు బ్యాటింగ్‌లోనూ అద్భుతాలు చేయగలడు. ఒత్తిడిని తట్టుకోగలడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 5 ఇన్నింగ్సుల్లో 5 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో ఇంగ్లాండ్ టాపార్డర్ భారీగా పరుగులు సాధిస్తుండటంతో బ్యాటంగ్ చేసే అవకాశం రావడం లేదు. అయినా 5 ఇన్నింగ్సుల్లో 30 యావరేజితో 120 పరుగులు చేశాడు.

షకీబ్ ఉల్ హాసన్
ఈ ప్రపంచకప్‌లో చెలరేగి ఆడుతున్నాడు. బంగ్లాదేశ్ జట్టు పసికూనగా ఉన్నప్పటి నుంచి జట్టులో ఆడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు ఇన్నింగ్సుల్లో 128 యావరేజితో 384 పరుగులు చేశాడు. ఛేదనలో రెండు సెంచరీలు చేయడంతో పాటు బౌలింగ్‌లో 5 వికెట్లు తీశాడు.

కొలిన్ డి గ్రాండ్‌హోమ్
ఈ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ముఖ్యంగా జట్టులోని అందరు ఆటగాళ్లు సమష్టిగా రాణిస్తున్నారు. ఇక, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ విషయానికి వస్తే నిలకడగా ఆడుతూ భాగస్వామ్యాలను నమోదు చేస్తున్నాడు. సఫారీలతో జరిగిన మ్యాచ్‌లో వికెట్లు పడుతున్న సమయంలో సారథికి అండగా నిలిచాడు. ఆడిన నాలుగు మ్యాచుల్లో నాలుగు వికెట్లు తీశాడు. కివీస్ టాపార్డర్ రాణిస్తుండటంతో బ్యాటింగ్ అవకాశాలు ఎక్కువగా లభించలేదు.
{document1}
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications