For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsSL: సంజూ ఆ పొరపాటు చేయకూడదు.. లెజెండరీ క్రికెటర్ సలహా

Best advise to Sanju Samson for INDvsSL T20 series

చాలా గ్యాప్ తర్వాత మళ్లీ టీమిండియా టీ20 జట్టులో కేరళ సూపర్ స్టార్ సంజూ శాంసన్‌కు చోటు దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, జట్టులో అతను రెగ్యులర్‌గా మారాలని అభిమానులు కోరుకుంటున్నారు. భారత్ తరఫున సంజూ చివరగా న్యూజిల్యాండ్ సిరీస్‌లో ఆడాడు. కివీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో కేవలం ఒక్క ఛాన్స్ మాత్రమే సంజూకు దక్కింది. ఆ తర్వాత సిరీస్ అంత బెంచ్‌కే పరిమితం అయ్యాడు.

 ఫామ్‌లో ఉన్నా అన్యాయం..

ఫామ్‌లో ఉన్నా అన్యాయం..

బంగ్లాదేశ్ పర్యటనలో రిషభ్ పంత్ గాయపడినా కూడా టీం మేనేజ్‌మెంట్ నుంచి సంజూకు పిలుపు రాలేదు. కీపింగ్ బాధ్యతలను కేఎల్ రాహుల్‌కు అప్పగించారు. ఇలాంటి నేపథ్యంలో టీ20 జట్టులో సంజూకు చోటు దక్కడం అదృష్టమనే చెప్పాలి. అతను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ చాలా రోజులుగా సెలెక్టర్లు మాత్రం సంజూకు అన్యాయం చేస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో భారత జట్టులో రాణించాలంటే సంజూ ఏం చేయాలి? అనే ప్రశ్న తలెత్తింది. దీనికి శ్రీలంక మాజీ లెజెండ్ సంగక్కర కీలక సూచన చేశాడు.

ఆటను ఎంజాయ్ చేయాలి..

ఆటను ఎంజాయ్ చేయాలి..

సంజూ ఏ స్థానంలో అయినా ఆడగలడు. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోగలడు. ఆ సత్తా, ట్యాలెంట్ రెండూ సంజూ సొంతం. ఇదే విషయాన్ని సంగక్కర కూడా చెప్పాడు. అయితే ఇదే తనకు దక్కే చివరి అవకాశం అని సంజూ తొందర పడకూడదని సలహా ఇచ్చాడు. ‘ఇదే నా చివరి ఛాన్స్ అని తొందర పడితే నష్టం తనకే. నన్నడిగితే సంజూ ప్రశాంతంగా ఆడాలి. తన ఆటను ఎంజాయ్ చేయాలి. మనం ఎంత బాగా ఆడామనేది తర్వాత ముందు ఆ ఆటను ఎంజాయ్ చేయాలి' అని చెప్పాడు.

ఐపీఎల్ వేరు.. టీమిండియా వేరు..

ఐపీఎల్ వేరు.. టీమిండియా వేరు..

ఐపీఎల్‌లో ఆడటం వేరు. టీమిండియాకు ఆడటం వేరు అనే విషయం సంజూ అర్థం చేసుకోవాలని సంగక్కర అన్నాడు. ‘అతను చాలా సింపుల్‌ విషయం అర్థం చేసుకోవాలి. తన బ్యాటింగ్ మీదనే కాన్‌సన్‌ట్రేట్ చేయాలి. భారత జట్టుకు ఆడే సమయంలో తన పాత్ర ఏంటో స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మైదానంలో దిగినప్పుడు ప్రశాంతంగా, రిలాక్స్‌డ్‌గా ఉండాలి. మన పాత్రకు ఎలా న్యాయం చేయాలనే విషయంపై ఒక క్లారిటీ ఉండాలి' అని వివరించాడు. తనకు అలవాటు లేని స్థానాల్లో బ్యాటింగ్ చేసే పరిస్థితి సంజూకు రావొచ్చని.. అయితే ఎక్కడైనా ఆడే సత్తా, బలం, నైపుణ్యం అన్నీ సంజూ వద్ద ఉన్నాయని సంగక్కర ధీమా వ్యక్తం చేశాడు.

Story first published: Friday, December 30, 2022, 7:05 [IST]
Other articles published on Dec 30, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+