కోహ్లీకి ఏమైంది?: మరీ అంత చీప్‌గా అవుటయ్యాడు
హైదరాబాద్: 'పూణెలో ఆడినంత చెత్త ఆట మళ్లీ రిపీట్ కాదు' రెండో టెస్టు ముందురోజు బెంగుళూరు చిన్నసామి స్టేడియంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విలేకరులతో అన్న మాటలివి. అయితే శనివారం బెంగుళూరులో టీమిండియా ఆడుతున్న తీరు చూస్తుంటే కోహ్లీ చెప్పినట్లుగా జరగడం లేదని అనిపిస్తోంది.
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ భారీ స్కోర్లు చేయడంలో విఫలమవుతున్నారు. రెండో టెస్టు తుది జట్టులో చోటు దక్కించుకున్న ఓపెనర్ అభినవ్ ముకుంద్ డౌకట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన పుజారా 17 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. ఇక కెప్టెన్ కోహ్లీ మళ్లీ అభిమానులను నిరాశపరిచాడు.

బెంగుళూరులో కూడా కోహ్లీ అదే పొరపాటు
పూణె టెస్టులో స్పిన్నర్‌ను అంచనా వేయలేకపోయిన కోహ్లీ ఈసారి బెంగుళూరు టెస్టులో కూడా అలాంటి పొరపాటే చేశాడు. బెంగుళూరులో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ ఆటతీరు అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఆసీస్ స్పిన్నర్ లియాన్ వేసిన ఆఫ్‌బ్రేక్ బంతిని కోహ్లీ వదిలేశాడు.
పూణె టెస్టులో క్లీన్ బౌల్డ్
ఇలాగే బంతిని వదిలేయబోయిన కోహ్లీ పూణె టెస్టులో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈసారి ఆలాగే ఆడబోయి ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు. అంపైర్ రివ్వ్యూకు వెళ్లిన కోహ్లీకి నిరాశే ఎదురైంది. దీంతో 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎల్‌బీడబ్ల్యూగా కోహ్లీ పెవిలియన్‌కు చేరాడు.

బెంగుళూరులో టెస్టులో నిరాశపరిచిన రహానే
మరోవైపు గత కొద్ది రోజులుగా విఫలమవుతున్న రహానే బెంగుళూరులో టెస్టులో కూడా నిరాశపరిచాడు. అయితే రహానేకు టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే మద్దతుగా నిలవడం విశేషం. ఈ టెస్టులో 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆసీస్ స్పిన్ బౌలర్ నాథన్ లియాన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

నాయర్ రూపంలో భారత్ ఐదో వికెట్
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జట్టు స్కోరు 156 పరుగుల వద్ద కరుణ్ నాయర్ రూపంలో భారత్ ఐదో వికెట్‌ను కోల్పోయింది. 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓకీఫ్ బౌలింగ్‌లో నాయర్ పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఆసీస్ స్పిన్నర్ లియాన్ మూడు వికెట్లు తీసుకుని భారత్ బ్యాటింగ్ లైనప్‌ను భారీ దెబ్బకొట్టాడు.

రెండో టెస్టులో కష్టాల్లో టీమిండియా
బెంగుళూరులో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. టీ విరామానికి 5 వికెట్లను కోల్పోయిన భారత్ 168 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ 79, రవిచంద్రన్ అశ్విన్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications