లోకల్ ప్లేయర్లంటే ఎందుకంత చులకన.. కోల్‌కతా మేనేజ్‌మెంట్‌కు మనోజ్ తివారీ సూటి ప్రశ్నలు..?

ఐపీఎల్లో రెండుసార్లు విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ - 2022 సీజన్లో మరోసారి నిరాశపరిచింది. ప్లేఆఫ్‌కు కూడా చేరుకోలేకపోయింది. ఇక కోల్‌కతా టీంలో బెంగాల్ ప్లేయర్లను ప్రోత్సహించకపోవడంపై బెంగాల్ క్రీడా మరియు యువజన శాఖ సహాయ మంత్రి మనోజ్ తివారీ కీలక వ్యాఖ్యలు చేశాడు. బెంగాల్లో సమర్థులైన ప్లేయర్లు లేరా అంటూ క్వశ్చన్ చేశాడు. ఇక కోల్‌కతా ఫ్రాంచైజీ లీగ్‌లో మూడో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరొందింది. ఇక 2012లో కోల్‌కతా తొలి ట్రోఫీని అందుకుంది. ఆ సంవత్సరం టైటిల్ గెలుచుకున్న జట్టులో మనోజ్ తివారీ కూడా ఉన్నాడు. కానీ బెంగాల్ ప్రాంతానికి చెందిన ఆటగాళ్లు ప్రస్తుత జట్టులో లేకపోవడంతో జట్టు మేనేజ్ మెంట్ పట్ల మనోజ్ తీవారీ తీవ్ర విమర్శలు గుప్పించాడు. మనోజ్ తివారీతో పాటు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, మహ్మద్ షమీ, లక్ష్మీ రతన్ శుక్లా, వృద్ధిమాన్ సాహాలు పశ్చిమ బెంగాల్ నుండి కేకేఆర్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ ఆటగాళ్లుగా ఉన్నారు. అయితే ఇటీవల కోల్‌కతా ఫ్రాంచైజీలో ఆడే బెంగాల్ ప్లేయర్లు కరువయ్యారు.

మార్పు కోరుకుంటున్నా
మనోజ్ తివారీ మాట్లాడుతూ.. 'కచ్చితంగా నేను మార్పును చూడాలనుకుంటున్నాను. చాలా మంది బెంగాల్ ప్లేయర్లు కేకేఆర్ జట్టులో ఉండాలని నేను ఎప్పుడూ అనుకుంటాను. నా ప్రశ్న ఏమిటంటే.. బెంగాల్ ప్లేయర్లు ఇతర జట్ల ప్లేయింగ్ ఎలెవెన్‌లో క్రమం తప్పకుండా ఆడుతున్నప్పుడు కేకేఆర్లో మాత్రం ఎందుకు ఆడట్లేదు. మేనేజ్‌మెంట్‌కు ఇదే నా ప్రశ్న. మేనేజ్ మెంట్ వారు కూడా ఎప్పుడూ ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడరు. వారు మౌనంగా ఉంటారు. ఈ ప్రశ్నకు వారు స్పందించేవారకు అడుగుతూనే ఉంటా' అని మనోజ్ తివారీ స్పోర్ట్స్ టాక్‌లో తెలిపారు.

లోకల్ ప్లేయర్లు ఉంటే యువతకు స్ఫూర్తి
బెంగాల్ రంజీ జట్టులోని దిగ్గజాలలో ఒకరైన మనోజ్ తివారీ మాట్లాడుతూ.. జట్టులో స్థానిక ఆటగాళ్లు ఉండడం వల్ల స్థానిక యువతకు క్రికెట్ పట్ల ప్రేరణ పెరుగుతుందన్నాడు. బెంగాల్ యువత తమ ప్రాంత ఆటగాళ్లు.. ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీల్లో ఆడడాన్ని చాలా హ్యాపీగా ఫీలవుతారని మనోజ్ పేర్కొన్నాడు. అవసరమైతే ఈ విషయంపై తాను ప్రత్యేకించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేకేఆర్ ఫ్రాంఛైజీ ఓనర్ షారుక్ ఖాన్‌తో కూడా మాట్లాడతానని మనోజ్ తెలిపాడు.

సీఎం మమతా బెనర్జీతో షారుఖ్ ఖాన్‌కు చెప్పిస్తా
'స్థానిక ఆటగాళ్లు జట్టులో ఉంటే.. అది మిగతా స్థానిక ప్లేయర్లకు స్ఫూర్తిగా ఉంటుంది. ఇక బెంగాల్ అభిమానులు సైతం తమ స్థానిక ఆటగాళ్లు బరిలోకి దిగుతుంటే మద్దతు ఇవ్వాలని కోరుకుంటారు. వారు ఎప్పుడూ కేకేఆర్ జట్టుకు మద్దతు ఇస్తారు, కానీ జట్టులో స్థానిక ఆటగాడు ఉన్నాడని తెలిస్తే మరింత మద్దతు పెరుగుతుంది. కానీ కోల్ కతా టీంలో ప్రస్తుతం బెంగాల్ ప్లేయర్లకు మొండిచేయి ఎదురవుతుంది. ఈ విషయమై మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీని షారుక్ ఖాన్‌తో మాట్లాడమని అడుగుతాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం' అని తివారీ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications