Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బెంగాల్ క్రికెటర్ రాహుల్ ఘోష్‌కు ఫ్రెండ్స్ స్వాగతం

కోల్‌కత్తా: వీడియోకాన్‌ క్రికెట్‌ అకాడమీ వేదికగా విజయ్‌ స్పోర్టింగ్‌, కోల్‌కతా పోలీస్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన కోల్‌కత్తా క్రికెటర్ రాహుల్ ఘోష్ (20) పూర్తిగా కోలుకోవడంతో అతడిని సోమవారం రాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

రాహుల్ ఘోష్‌కు చికిత్సను అందించిన డాక్టర్ బుద్దదేవ్ సాహా మీడియాతో మాట్లాడుతూ "మూడు వారాల పాటు రాహుల్‌కు విశ్రాంతి అవసరం. పూర్తిగా బెడ్ రెస్ట్ కాదు. కావాలంటే తన ఇంటి చుట్టూ నడిస్తే మంచిది" అని చెప్పారు. రాహుల్ ఘోష్ మెదడులో గడ్డకట్టిన రక్తం క్రమేపి పూర్తిగా తగ్గడంతో అతడిని డిశ్చార్జి చేసినట్లు డాక్టర్ బుద్దదేవ్ సాహా చెప్పారు.

Bengal cricketer Rahul Ghosh discharged from hospital


ఆసుపత్రి నుంచి రాహుల్‌ను డిశ్చార్జి చేయడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు అతనికి స్వాగతం తెలిపారు. రాహుల్‌ని ఇంటికి తీసుకొచ్చిన అంబులెన్స్‌ను కూడా పూర్తిగా అలంకరించి మరీ తీసుకొచ్చారు. రాహుల్ ఘోష్‌ వైద్యానికి అయిన ఖర్చంతా క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) భరించిన సంగతి తెలిసిందే.

విజయ్‌ స్పోర్టింగ్‌, కోల్‌కతా పోలీస్‌ జట్ల మధ్య జరిగిన బెంగాల్‌ క్రికెట్‌ సంఘం సెకండ్‌ డివిజన్‌ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్‌ కొట్టిన బంతి తలకు తగలడంతో రాహుల్‌ ఘోష్‌ (19) తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దీంతో తీవ్ర రక్తస్రావంతో అతను మైదానంలోనే కుప్పకూలాడు. వెంటనే అతడిని నైటింగేల్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+