Ben Stokes Warns India: ప్రత్యర్థి ఎవరైనా అటాకింగ్లో తగ్గేదే లే.. ఇండియాకు బెన్ స్టోక్స్ వార్నింగ్!

ఇటీవల ముగిసిన టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్ జట్టును 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన తర్వాత.. ఇంగ్లాండ్ మంచి విజయోత్సాహంతో ఉంది. ఇక జులై 1నుంచి ఇండియాతో ఇంగ్లాండ్ రీషెడ్యూల్ చేసిన 5వ టెస్ట్ ఆడబోతుంది. ఇక ఈ టెస్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు కెప్టెన్ బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు. భారత క్రికెట్ జట్టుకు కూడా న్యూజిలాండ్‌కు ఇచ్చిన ట్రీట్‌మెంటే ఇస్తామని బెన్ స్టోక్స్ హెచ్చరికలు జారీ చేశాడు.
స్టోక్స్ తనను టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా నియమించినప్పుడు.. టెస్ట్ ఫార్మాట్‌లో జట్టు ఆలోచనను, ఆడే వైఖరిని మార్చడమే తన ప్రధాన లక్ష్యమని స్టోక్స్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ సిరీస్లో మూడు టెస్ట్ మ్యాచ్‌లలో ఫోర్త్ ఇన్నింగ్స్‌లో 270కంటే ఎక్కువ స్కోర్లను ఛేదించిన ఇంగ్లాండ్ అద్వితీయ విజయాన్ని అందుకుంది.

బర్మింగ్‌హామ్‌కు బ్రాండ్ క్రికెట్
ఇక రీషెడ్యూల్ చేసిన అయిదో టెస్ట్‌లో భారత్‌తో ఢీకొనేందుకు సిద్ధమవుతున్న తరుణంలో బర్మింగ్‌హామ్‌కు తమ బ్రాండ్ క్రికెట్‌ను తీసుకువస్తామని స్టోక్స్ పేర్కొన్నాడు. ఎటాకింగ్ గేమ్‌ను ఇండియాతో కూడా ఆడతామని హెడ్డింగ్లీలో మ్యాచ్ అనంతరం జరిగిన అవార్డు ప్రెజెంటేషన్ సందర్భంగా బెన్ స్టోక్స్ తెలిపాడు. 'ఇండియాతో సిరీస్ డ్రా చేసుకోవడానికి మాకు ఇంకా అవకాశం ఉంది. మేము అదే ఆలోచనతో న్యూజిలాండ్‌తో ఆడినట్లే ఆడతాము' అని పేర్కొన్నాడు.

గతేడాది మానసిక సమస్యలతో 4వ టెస్ట్‌కు స్టోక్స్ దూరం
గతేడాది భారత్‌తో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ సమయంలో మానసిక ఆరోగ్య సమస్యలతో బెన్ స్టోక్స్ విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. 'సహజంగానే ఇండియా పూర్తి భిన్నమైన ప్రత్యర్థి. కానీ ఈ మూడు మ్యాచ్‌ల్లో మా ఎటాకింగ్ ఎలా కొనసాగిందో.. ఇండియాతో కూడా అదే రకమైన ఎటాకింగ్ గేమ్ కొనసాగిస్తాం' అని స్టోక్స్ పేర్కొన్నాడు. ప్రస్తుతం.. ఇంగ్లాండ్ అయిదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-2తో వెనుకబడి ఉంది. గత సంవత్సరం జరిగిన ఈ సిరీస్లో భారత శిబిరంలో కరోనా వ్యాప్తి కారణంగా చివరి టెస్ట్ నిలిపివేయబడింది. ఇంగ్లాండ్ ఈ టెస్టు మ్యాచ్ కోసం తమ 15మంది సభ్యుల జట్టును ప్రకటించింది.

అయిదో టెస్ట్ కోసం ఇరు జట్లు
ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు : బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, సామ్ బిల్లింగ్స్, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ ఫోక్స్, జాక్ లీచ్, అలెక్స్ లీస్, క్రెయిగ్ ఓవర్‌టన్, జామీ ఓవర్‌టన్, మాథ్యూ పాట్స్, ఆలీ పోప్
భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ షమీ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, మయాంక్ అగర్వాల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications