న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దేశవాళీలో మ్యాచ్‌లో ప్రత్యర్థిని బెంబేలెత్తించిన బెన్ స్టోక్స్

Ben Stokes strengthens Ashes call-up hopes with 93 off 47 balls to help Canterbury beat Otago

హైదరాబాద్: ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ న్యూజిలాండ్‌ దేశవాళీ లీగ్‌లో విజృంభించాడు. గురువారం ఒటాగోతో జరిగిన మ్యాచ్‌లో స్టోక్స్‌ 47 బంతుల్లో ఏడు సిక్సర్లు, ఆరు బౌండరీలతో 93 పరుగులు సాధించి సత్తా చాటాడు. దీంతో కాంటెర్‌బర్రీ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 217 పరుగుల్ని సాధించింది.

చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉన్న జట్టును బ్యాటింగ్‌కు దిగి స్టోక్స్‌ తనదైన శైలిలో నిలబెట్టాడు. ఆ పై సాధారణ లక్ష్యంతో బ్యాటింగ్‌ దిగిన ప్రత్యర్థి జట్టు ఒటాగో 83 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా కాంటర్‌బెర్రీ 134 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాంటెర్‌బర్రీ తరపున బరిలో ఆడుతున్న బెన్ స్టోక్స్ తొలి మూడు మ్యాచ్ ల్లో విఫలమయ్యాడు. మూడింటిలో కలిపి 36 పరుగులే చేశాడు.

ఇటీవల ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘటనలో స్టోక్స్‌ విచారణ ఎదుర్కొంటున్నాడు. ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) నిషేధం ఎదుర్కొంటున్న స్టోక్స్‌.. కొన్ని రోజుల క్రితం న్యూజిలాండ్‌ దేశవాళీ లీగ్ ఆడటానికి స్వల్ప కాలిక ఒప్పందం చేసుకున్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 15, 2017, 17:25 [IST]
Other articles published on Dec 15, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X