Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: అండర్సన్ ఇన్- స్టోక్స్ ఔట్.. స్టార్ ప్లేయర్ల కనీస ధర పూర్తి జాబితా ఇదే!

ఐపీఎల్ మెగా వేలానికి ముహుర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో మెగా ఆక్షన్‌ను నిర్వహించనున్నట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. విదేశాల్లో ఐపీఎల్ వేలాన్ని నిర్వహించడం వరుసగా ఇది రెండోసారి. వేలానికి 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 1165 మంది భారత క్రికెటర్లు ఉండగా, 409 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు.

విదేశీ ఆటగాళ్లలో అత్యధికంగా సౌతాఫ్రికా నుంచి 91 మంది ప్లేయర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు (76) ఉన్నారు. అసోసియేట్ దేశాల నుంచి 30 మంది ప్లేయర్లు మెగా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ఇప్పటివరకు ఐపీఎల్‌లో అరంగేట్రం చేయని 42 ఏళ్ల ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ మెగా వేలంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. కనీస ధర రూ.1.50 లక్షలతో రిజిస్టర్ అయ్యాడు.

Ben Stokes Skips IPL 2025 Auction Pant Rahul Starc Lead with Top Base Price Anderson Registers

భారీ డిమాండ్ ఉన్న రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కనీస ధర రూ.2 కోట్లతో వేలంలోకి వస్తున్నారు. వీళ్లతో పాటు భారత క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, మహ్మద్ షమి, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్, ఇషాన్ కిషన్, ముకేశ్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రసిధ్ కృష్ణ, నటరాజన్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్య, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ వంటి స్టార్ ప్లేయర్లు కనీస ధర రూ. 2 కోట్లతోనే బరిలోకి దిగుతున్నారు.

ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకోలేదు. ఆ దేశ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్, ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ వేలానికి వస్తున్నారు. కాగా, మిచెల్ స్టార్క్, జోఫ్రా ఆర్చర్, స్టీవ్ స్మిత్, జానీ బెయిర్‌స్టో, అట్కిన్సన్, జోస్ బట్లర్, కగిసో రబాడ, గ్లెన్ మాక్స్‌వెల్, మార్క్ వుడ్ వంటి స్టార్ విదేశీ ప్లేయర్లు రూ.2 కోట్లతో బరిలోకి దిగుతున్నారు. గత మినీ వేలంలో అమ్ముడుపోని పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ వంటి బ్యాటర్లు రూ.75 లక్షలతో వేలంలోకి రానున్నారు.

కాగా, ఓ ఫ్రాంచైజీ గరిష్టంగా 25 మంది ఆటగాళ్లతో జట్టును నిర్మించుకోవచ్చు. ఈ నేపథ్యంలో 204 స్లాట్లకు వేలం జరగనుంది. ఇందులో 70 ఓవర్సీస్ ప్లేయర్లకు అవకాశం ఉంది. కాగా, ప్రతి ఫ్రాంచైజీకి రూ.120 కోట్లు కేటాయించగా, రిటెన్షన్ ప్రక్రియ అనంతరం పంజాబ్ కింగ్స్ వద్ద అత్యధికంగా రూ.110.50 కోట్లు ఉన్నాయి. అతి తక్కువగా రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ.41 కోట్లు ఉన్నాయి.

Story first published: Wednesday, November 6, 2024, 8:53 [IST]
Other articles published on Nov 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+