Eng Vs Nz 1st Test: 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ట్విస్ట్ గుర్తుందా..? మళ్లీ స్టోక్స్ విషయంలో అదే జరిగింది

ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య లార్డ్స్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ చివర్లో జరిగిన ఓవర్ త్రోనూ గుర్తుకుతెచ్చింది. ఇక రెండో ఇన్నింగ్స్ 43వ ఓవర్‌లో బౌల్ట్ బౌలింగ్ వేయగా.. జో రూట్ మిడ్ వికెట్ దిశగా షాట్ ఆడాడు. ఇక ఇన్నర్ సర్కిల్లో ఉన్న ఫీల్డర్ వెంటనే బంతిని అందుకున్నాడు. అప్పటికే సింగిల్ తీద్దామని నాన్ స్ట్రైక్ ఎండ్ నుంచి రన్ కోసం పరిగెత్తిన స్టోక్స్.. ఫీల్డర్ బంతి అందుకోవడం చూసి వెంటనే రిటర్న్ అయ్యాడు. ఫీల్డర్ సైతం నాన్ స్ట్రై ఎండ్ వైపు త్రో విసిరాడు. ఇక ఆ త్రో.. స్టోక్స్ బ్యాట్‌కు తాకి లాంగ్ ఆన్ దిశగా వెళ్లింది. ఇక బౌల్ట్ ఫన్నీగా.. ఏంటీ స్టోక్స్ ఇలా చేశావ్ అన్నట్లు అతని ముందు నిలబడ్డాడు. స్టోక్స్ సైతం ఫన్నీగా నాదేం తప్పు లేదు.. నేను బ్యాట్ క్రీజులో పెడుతుంటే బాల్ వచ్చి తాకిందన్నట్లు రెండు చేతులు పైకెత్తాడు. రూట్ సైతం చేతులు పైకెత్తి 2019నాటి ఘటనను గుర్తుచేశాడు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు నవ్వులు చిందించారు.
2019లో మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా ఓవర్ త్రో
ఇక 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్.. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ మ్యాచ్‌గా పేర్కొంటారు. ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఇంగ్లాండ్ గెలుపుకు 3 బంతుల్లో 9పరుగులు కావాల్సిన తరుణమది. చివరి ఓవర్లో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ చేస్తున్నాడు. మూడో బంతిని స్టోక్స్ మిడాఫ్ దిశగా ఆడాడు. బంతిని అందుకున్న ఫీల్డర్ మార్టిన్ గప్టిల్ చాకచక్యంగా అందుకున్నాడు. రనౌట్‌కు అవకాశం ఉండడంతో స్ట్రైకర్ ఎండ్ వైపు ఓవర్ త్రో వేశాడు. రెండో పరుగు కోసం వస్తున్న స్టోక్స్ రనౌట్ తప్పించుకోవడానికి క్రీజులోకి డైవ్ చేశాడు. ఈ క్రమంలో అతని బ్యాట్‌కు తాకిన బంతి మిడ్ వికెట్ మీదుగా బౌండరీ వెళ్లింది. దీంతో 6పరుగులొచ్చాయి. అంతే సమీకరణం 2బంతుల్లో 3పరుగులకు చేరుకుంది. ఇక చివరి 2బంతుల్లో 2పరుగులు మాత్రమే రావడంతో ఆ మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీయడం.. సూపర్ ఓవర్లో కూడా ఇరు జట్లు సేమ్ పరుగులు చేయడంతో బౌండరీల ఆధారంగా.. ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలవడం తెలిసిందే.
స్టోక్స్ రిమార్కబుల్ ఇన్నింగ్స్
మూడో బంతికి స్టోక్స్ బ్యాట్‌కు తాకి బంతి బౌండరీ వెళ్లడంతో అది నా తప్పు కాదు అన్నట్లు స్టోక్స్ వెంటనే మోకాళ్లపై కూర్చుని చేతులు పైకెత్తి సారీ చెప్పాడు. దాన్ని అంపైర్ కూడా అంగీకరించాడు. దీంతో ఆ బంతికి 6పరుగులొచ్చాయి. ఈ ఊహించని పరిణామం చోటుచేసుకోవడంతో కివీస్ ఆటగాళ్లు షాక్ తిన్నారు. ఇక ఈ ఘటనే న్యూజిలాండ్‌ను వరల్డ్ కప్ అందుకోకుండా చేసింది. ఇకపోతే ఆ మ్యాచ్‌లో ఒంటరి పోరాటం చేసిన స్టోక్స్ చరిత్రపుటల్లో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఆల్ టైం బెస్ట్ ఇన్నింగ్స్‌లో స్టోక్స్ ఆడిన ఇన్నింగ్స్ ఒకటిగా నిలిచిపోయింది.
ఇంగ్లాండ్‌కు 61పరుగులు, న్యూజిలాండ్‌కు 5వికెట్లు
ఇక ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ మూడో 285పరుగులకు ఆలౌట్ కావడంతో 277పరుగుల విజయలక్ష్యంతో ఇంగ్లాండ్ బరిలోకి దిగింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. జో రూట్ (131 బంతుల్లో 77పరుగులు నాటౌట్, 7 ఫోర్లు), బెన్ ఫోక్స్ (9 నాటౌట్) క్రీజులో మొండిగా పోరాడుతున్నారు. గెలుపు కోసం ఇంగ్లాండ్ మరో 61పరుగులు చేయాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో 69పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఇంగ్లాండ్‌ను రూట్, కెప్టెన్ బెన్ స్టోక్స్ (110 బంతుల్లో 54, 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) 90పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications