Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంత త‌ప్పేం చేశాడు? విలియ‌మ్స‌న్‌కు జీవిత‌కాల క్ష‌మాప‌ణ చెప్పిన బెన్‌స్టోక్స్‌!

ICC Cricket World Cup 2019 Final:Ben Stokes Promoses To Apologise To Kane Williamson After The Match
Ben Stokes promises to apologise to Kane Williamson for the rest of his life

లండ‌న్‌: క్రికెట్‌కు పుట్టినిల్లుగా పేరు పొందిన ఇంగ్లండ్‌.. ఎట్ట‌కేల‌కు విశ్వవిజేత‌గా ఆవిర్భ‌వించింది. స‌గ‌ర్వంగా ప్ర‌పంచ‌క‌ప్‌ను అందుకుంది. లండ‌న్‌లోని లార్డ్స్ మైదానంలో సూప‌ర్ ఓవ‌ర్ చివ‌రిబంతి వ‌ర‌కూ అత్యంత ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జ‌ట్టు.. కేన్ విలియ‌మ్స‌న్ సార‌థ్యంలోని న్యూజిలాండ్ జ‌ట్టును ఓడించింది. సూప‌ర్ ఓవ‌ర్ సైతం టైగా ముగిసిన‌ప్ప‌టికీ.. ఎక్కువ బౌండ‌రీల‌ను సాధించడం వ‌ల్ల ఇంగ్లండ్‌ను క్రికెట్ జ‌గ‌జ్జేత‌గా ప్ర‌క‌టించారు.

స్టోక్స్ పొర‌పాటు.. మ్యాచ్ టై!

స్టోక్స్ పొర‌పాటు.. మ్యాచ్ టై!

ఈ మ్యాచ్‌లో అత్య‌ధిక స్కోర్‌ను సాధించిన ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ బెన్‌స్టోక్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. క్రికెట్ దేవుడు స‌చిన్ టెండుల్క‌ర్ ఈ అవార్డును ఆయ‌న‌కు అందజేశారు. ఈ సంద‌ర్భంగా త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నాడు బెన్‌స్టోక్స్‌. అత‌ని నోటి నుంచి వ‌చ్చిన మొట్ట‌మొద‌టి మాట- ప్ర‌త్య‌ర్థి న్యూజిలాండ్ జ‌ట్టు కేప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్‌కు క్ష‌మాప‌ణ చెప్ప‌డం. త‌న అద్భుత‌మైన బ్యాటింగ్ వ‌ల్ల కాదు గానీ.. పొర‌పాటున చేసిన ప‌ని వ‌ల్ల బెన్‌స్టోక్స్‌.. న్యూజిలాండ్ జ‌ట్టు విజ‌యాన్ని అడ్డుకున్నాడు. ఆ పొర‌పాటు వ‌ల్లే మ్యాచ్ టైగా ముగిసింది. బెన్‌స్టోక్స్ ఆ పొర‌పాటే చేయ‌కుండా ఉండి ఉంటే ఫ‌లితం మరోలా ఉండేదనే అనుకోవ‌చ్చు.

న్యూజిలాండ్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్న త్రో..

న్యూజిలాండ్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్న త్రో..

ఒకే ఒక్క పొర‌పాటు న్యూజిలాండ్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. చివ‌రి ఓవ‌ర్‌లో అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌తో ఆరు ఓవ‌ర్ల‌ను స‌మ‌ర్పించుకోవాల్సి వ‌చ్చింది న్యూజిలాండ్‌. అదే మ్యాచ్‌ను మ‌లుపు తిప్పింది. దీనికి ప్ర‌ధాన కార‌కుడు బెన్‌స్టోక్స్‌. అనుకోకుండా జ‌రిగిన ఘ‌ట‌నే అయిన‌ప్ప‌టికీ.. అందులో స్టోక్స్ త‌ప్పిదం లేక‌పోలేదు. అందుకే-కేన్ విలియ‌మ్స‌న్‌కు తాను జీవిత‌కాలానికి స‌రిప‌డేంత క్ష‌మాప‌ణ కోరుతున్నాన‌ని చెప్పాడు బెన్‌స్టోక్స్‌. అంత పెద్ద త‌ప్పేం చేశాడ‌నే అనుమానం రావ‌చ్చు. ఓ ర‌కంగా మ్యాచ్ టై కావ‌డానికి, సూప‌ర్ ఓవ‌ర్ దాకా వెళ్ల‌డానికీ బెన్‌స్టోక్సే ప్ర‌ధాన కార‌కుడు. అత‌ని బ్యాటింగ్ వ‌ల్ల కాదు.. బ్యాట్‌ను త‌గ‌ల‌డం వ‌ల్ల‌.

 స్టోక్స్ బ్యాట్‌ను తాకి..బౌండ‌రీ దాటి..

స్టోక్స్ బ్యాట్‌ను తాకి..బౌండ‌రీ దాటి..

ఇంగ్లండ్ ఇన్నింగ్ ఆఖరి ఓవర్‌లో ట్రెంట్ బౌల్ట్ వేసిన 4వ బంతిని స్టోక్స్ డీప్ మిడ్ వికెట్ దిశగా బాదాడు. రెండు ప‌రుగులు తీశాడు. రెండు ప‌రుగుల‌తోనే ఆగిపోవాల్సిన ప‌రిస్థితి అది. రెండో పరుగును కోసం ప్ర‌య‌త్నించిన స‌మ‌యంలో బెన్ స్టోక్స్ కీపర్ ఎండ్‌కు వెళ్తూ రనౌట్ నుంచి తప్పించుకోవ‌డానికి క్రీజులోకి డైవ్ చేశాడు. న్యూజిలాండ్ ఫీల్డర్ నుంచి వచ్చిన బంతి స్టోక్స్‌కు తగిలి బౌండరీకి తరలింది. దీంతో ఆ బంతికి మొత్తం ఆరు పరుగులు వచ్చాయి. స్టోక్స్ మొద‌ట చేసిన రెండు ప‌రుగుల‌తో పాటు.. బంతి బౌండ‌రీని త‌గ‌ల‌డం వ‌ల్ల వ‌చ్చిన నాలుగు ప‌రుగుల‌ను ఇంగ్లండ్ ఖాతాలో వేశారు. ఆ ప‌రుగులే గ‌న‌క లేక‌పోయి ఉంటే- మ్యాచ్ న్యూజిలాండ్ వైపు మొగ్గు చూపించి ఉండేదే!

ఉద్దేశ‌పూర‌కంగా చేయ‌లేదు..

ఉద్దేశ‌పూర‌కంగా చేయ‌లేదు..

తాను ఉద్దేశపూర‌కంగా బంతికి బ్యాట్‌ను అడ్డు పెట్ట‌లేద‌ని బెన్‌స్టోక్స్ వివ‌ర‌ణ ఇచ్చుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. అనుకోకుండా చోటు చేసుకున్న ఘ‌ట‌న అని, దాని వ‌ల్ల మ్యాచ్ టైగా ముగిసింద‌ని బెన్‌స్టోక్స్ అంగీక‌రించాడు. అందుకే- కేన్ విలియ‌మ్స‌న్‌కు త‌న జీవితకాలం పాటు క్ష‌మాప‌ణ చెబుతున్నాన‌ని అన్నాడు. ఈ మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్ మ‌రోసారి ఇంగ్లండ్ టీమ్‌కు ఆప‌ద్బాంధ‌వుడ‌య్యాడు. ఈ మ్యాచ్‌లో 84 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. వ‌రుస‌గా వికెట్ల‌ను ప‌డుతున్న స‌మ‌యంలో బ్యాటింగ్‌కు దిగిన బెన్‌స్టోక్స్ 98 బంతుల్లో అయిదు ఫోర్లు, రెండు సిక్స‌ర్ల‌తో 84 ప‌రుగులు చేశాడు. చివ‌రి వ‌ర‌కూ నాటౌట్‌గా నిలిచాడు.

Story first published: Monday, July 15, 2019, 9:14 [IST]
Other articles published on Jul 15, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+