Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020: రాజస్థాన్ రాయల్స్‌కు శుభవార్త.. బెన్ స్టోక్స్ వచ్చేస్తున్నాడు!!

Ben Stokes likely to join Rajasthan Royals for IPL 2020

దుబాయ్‌: రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టు అభిమానులకు శుభవార్త. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ వచ్చే నెల తొలి వారంలో యూఏఈ చేరుకోనున్నాడని సమాచారం తెలుస్తోంది. దీంతో ఈ ఐపీఎల్‌ సీజన్‌లో స్టోక్స్‌ ఆడతాడా లేదా అనే దానిపై ఓ క్లారిటీ వచ్చింది. ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌.. స్టోక్స్‌ రాకపై పెదవి విప్పాడు. ఐపీఎల్‌లో రాయల్స్ విజయంతో బోణీ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో గెలుపొందింది.

న్యూజిలాండ్‌లో ఉండే స్టోక్స్‌ తండ్రి క్యాన్సర్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో గత నెల పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఐపీఎల్ 2020‌లో స్టోక్స్‌ ఆడే విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. అతడి ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ కూడా ఎప్పటికప్పుడు అతడికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటూ వస్తోంది. న్యూజిలాండ్‌లో ఉండగానే ట్రైనింగ్ మొదలుపెట్టిన స్టోక్స్.. వచ్చే నెల తొలి వారంలో యూఏఈ చేరుకుని జట్టుతో కలుస్తాడని తెలుస్తోంది.

అక్టోబర్‌ తొలి వారంలో బెన్ స్టోక్స్ యూఏఈ వచ్చినా ఐపీఎల్‌ తొలి అర్థభాగాన్ని కోల్పోతాడు. యూఏఈ చేరుకున్న వెంటనే ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండడం తప్పనిసరి. ఆ తర్వాత రెండు సార్లు నిర్వహించే కరోనా పరీక్షల్లో నెగటివ్ ఫలితం వస్తే.. బబుల్‌లో చేరుతాడు. అంటే ఆక్టోబరు రెండో వారంలో ఆర్ఆర్ జెర్సీ ధరించే అవకాశం ఉంది. స్టోక్స్ జట్టులో చేరితే మేనేజ్‌మెంట్‌కు తలనొప్పి తప్పదు.

రాజస్తాన్‌ రాయల్స్‌లో ప్రధాన ఆటగాళ్లంతా విదేశీ ఆటగాళ్లే. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, బెన్ స్టోక్స్‌, టామ్‌ కరన్‌, జోఫ్రా ఆర్చర్‌, డేవిడ్‌ మిల్లర్‌, జోస్‌ బట్లర్‌ అందరూ విదేశీ ఆటగాళ్లే. దాంతో ఆర్‌ఆర్‌కు సరికొత్త తలనొప్పి మొదలైంది. తుది జట్టులో నలుగురు మించి విదేశీ ఆటగాళ్లు ఉండకూడదు. దీంతో ఆర్‌ఆర్‌కు ఇబ్బందిగా మారింది. ఇక స్టోక్స్‌ జట్టుతో కలిస్తే.. టామ్‌ కరన్‌ను పక్కకు పెట్టక తప్పదు. సీఎస్‌కేతో రాజస్తాన్‌ ఆడిన తొలి మ్యాచ్‌లో కరన్‌ ఆడాడు. ప్రస్తుతానికి కరన్‌ ఎంపికకు ఇబ్బంది లేకపోయినా.. స్టోక్స్‌ వస్తే అతడు బెంచ్‌కు పరిమితం కావాల్సిందే.

Story first published: Thursday, September 24, 2020, 20:14 [IST]
Other articles published on Sep 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+