మయాంక్ అగర్వాల్ గాల్లోకి ఎగిరి
ముజీబ్ బౌలింగ్‌లో బౌండరీ దిశగా బంతిని గాల్లోకి లేపాడు. లాంగ్ ఆఫ్ వద్ద బౌండరీలైన్ సమీపంలో ఫీల్డింగ్ చేస్తోన్న మయాంక్ అగర్వాల్ గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు. అదే క్యాచ్ కోసం మనోజ్ తివారి దూరం నుంచి పరిగెత్తుకొచ్చాడు. గాల్లోకి ఎగిరి అందుకున్నప్పటికీ.. తాను బౌండరీ లైన్‌ను తాకే అవకాశం ఉందని పసిగట్టిన మయాంక్ బంతిని తివారి వైపు విసిరాడు.

బౌండరీ లైన్ దగ్గర అద్భుతమైన క్యాచ్‌తో
అతడు బంతిని ఒడుపుగా అందుకోవడంతో నమ్మశక్యం కాని రీతిలో అవుటైన బెన్ స్టోక్స్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఐపీఎల్‌లో అత్యుత్తమ క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా రికార్డ్ ఉన్న స్టోక్స్ అలాంటి క్యాచ్‌కే ఔటవడం విశేషం. ఇదిలా ఉంటే అంతకుముందు రోజు మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ బౌండరీ లైన్ దగ్గర అద్భుత క్యాచ్‌తో కోహ్లిని పెవిలియన్ చేరిస్తే.. ముంబై ఇండియన్స్‌పై కోహ్లి డైవ్ చేస్తూ అందుకున్న క్యాచ్ అందర్నీ అలరించింది.

రాజస్థాన్ జట్టుకు ఓటమి
కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి సూపర్‌మ్యాన్‌లా ఒడిసిపట్టిన తీరు అందరినీ అలరించింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మళ్లీ రాజస్థాన్ జట్టుకు ఓటమి తప్పలేదు. చేధనలో కేఎల్ రాహుల్ హిట్టింగ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.

రాజస్థాన్ రాయల్స్ ఆఖరి స్థానంలో
మళ్లీ ఇవే ఇరు జట్లు ప్రత్యర్థలుగా మంగళవారం జరగనున్న మ్యాచ్‌లో జైపూర్ వేదికగా తలపడనున్నారు. గత మ్యాచ్ ఫలితాల ఆధారంగా 12పాయింట్లతో పంజాబ్ జట్టు లీగ్ పట్టికలో మూడో స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ ఆఖరి స్థానంలో ఉంది.


Click it and Unblock the Notifications












