స్టార్ ప్లేయర్ కు సర్జరీ విజయవంతం - ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ కు దూరం
గాయం కారణంగా కొద్ది రోజుల నుంచి మైదానానికి దూరంగా ఉన్నాడు ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్. అయితే తాజాగా అతడు సర్జరీ చేయించుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపిన అతడు, తనని తాను బయోనిక్ మ్యాన్ గా అభివర్ణించుకున్నాడు. శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని పేర్కొన్నాడు.
ఫిజికల్ గా డ్యామేజ్
డిసెంబర్ లో న్యూజిలాండ్ తో జరిగిన మూడో టెస్ట్ లో స్టోక్స్ గాయపడ్డాడు. తొడకండరాల గాయం కారణంగా అతడు మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అప్పుడే తనకు శస్త్రచికిత్స జరగనుందని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా తెలిపింది. అయితే వాస్తవానికి స్టోక్స్ కు గతేడాది ఆగస్ట్ లోనే ది హండ్రెడ్ లీగ్ లో తొడకండరాల గాయం అయింది.

మాంచెస్టర్ ఒరిజినల్స్ తో జరిగిన మ్యాచ్ లో నెథరన్ సూపర్ ఛార్జర్స్ తరఫున బరిలోకి దిగిన అతడు బ్యాటింగ్ చేసే సమయంలో గాయం బారిన పడ్డాడు. దీంతో అతడు రెండు నెలలు ఆటకు దూరమయ్యాడు. శ్రీలంకతో జరిగిన హోమ్ టెస్ట్ కు మిస్ అయ్యాడు. ఆ తర్వాత పాకిస్థాన్, న్యూజిలాండ్ పర్యటన కోసం ఫిట్ నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమించాడు. కానీ న్యూజిలాండ్ పర్యటనలో మళ్లీ తొడకండరాల గాయం అతడిని వెంటాడింది. అయితే ఫిట్ నెస్ కోసం చేసిన ప్రయత్నం, తనను ఫిజికల్ గా డ్యామేజ్ చేసిందని స్టోక్స్ పేర్కొన్నాడు.
అప్పటి వరకు ఫుల్ రెస్ట్
ఇప్పుడు ఈ శస్త్రచికిత్స జరగడం వల్ల స్టోక్స్ మూడు నెలల వరకు ఆడలేడు. రిహ్యాబిలిటేషన్ లో ఉండనున్నాడు. అందుకే ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన ఇంగ్లాండ్ జట్టుకు కూడా ఎంపిక కాలేదు. ఐపీఎల్ 2025 కూడా అందుబాటులో ఉండలేదు. మొత్తంగా మే వరకు మళ్లీ టెస్ట్ క్రికెట్ లో ఆడలేదు. ఈ మూడు నెలల పాటు పూర్తి ఫిట్ నెస్ సాధించి, ఆ తర్వాత వేసవిలో క్రికెట్ ఆడనున్నాడు. అనంతరం జూన్ లో టీమ్ ఇండియాతో జరగబోయే టెస్ట్ సిరీస్ లోనూ బరిలోకి దిగుతాడు.
త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు
స్టోక్స్ తాజా సర్జరీ పోస్ట్ చూసిన క్రికెట్ అభిమానులు అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అతడికి కామెంట్లు పెడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications