Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బెన్ స్టోక్స్‌కు జట్టులో చోటిచ్చినా పోలీసులు ఆడనివ్వరేమో..!

Ben Stokes included in England T20 squad for tri-series; Moeen Ali, Jonny Bairstow rested

హైదరాబాద్: ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ మరోసారి జట్టులో స్థానం దక్కించుకున్నాడు. స్థానం అయితే దక్కించుకున్నాడు కానీ ఈ సారైనా ఆడతాడో లేదోనన్న అనుమానంతో అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. యాషెస్‌ సిరీస్‌, ఆ తర్వాత ఆసీస్‌తో వన్డే సిరీస్‌ కోసం ఎంపిక చేసిన ఇంగ్లాండ్‌ జట్టులో చోటు సంపాదించుకున్న స్టోక్స్‌ ఆ తర్వాత యాషెస్‌లో ఆడని సంగతి తెలిసిందే.

దీంతో వన్డే సిరీస్‌ జట్టు నుంచి అతన్ని తప్పిస్తున్నట్లు తాజాగా ఇంగ్లాండ్‌, వేల్స్‌ బోర్డు ప్రకటించింది. గతేడాది వెస్టిండీస్‌పై విజయం అనంతరం బ్రిస్టల్‌లో ఓ బార్‌కు వెళ్లిన స్టోక్స్‌ అక్కడ ఒకరితో ఘర్షణకు దిగాడు. అయితే ఆ వివాదంలో కేసు నమోదైంది.

దీని నిమిత్తం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. పోలీసుల నుంచి ఎలాంటి క్లియరెన్స్ రాకపోవడంతో స్టోక్స్‌ జట్టులో స్థానం దక్కించుకున్నా మ్యాచులు ఆడలేకపోతున్నాడు. తాజాగా ఇంగ్లాండ్‌-ఆసీస్‌-న్యూజిలాండ్‌ మధ్య ఫిబ్రవరి 7 నుంచి ముక్కోణపు టీ20 సిరీస్‌ జరగనుంది.

ఈ సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌ స్టోక్స్‌కు జట్టులో స్థానం కల్పించింది. సిరీస్‌ జరిగే సమయంలో విచారణ ఉంటుందో లేదో 48 గంటల్లో స్టోక్స్‌కు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. దీంతో జట్టులో చోటు దక్కించుకున్న స్టోక్స్‌ పరిస్థితి ఆగమ్య గోచరమే. స్టోక్స్‌ ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటాడని ఆ దేశ బోర్డు తాజాగా ప్రకటించింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 8, 2018, 16:35 [IST]
Other articles published on Jan 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+