సూర్యను అడ్డుకుంటామని ఆశిస్తున్నా.. సెమీస్ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ స్టార్ కామెంట్స్

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుతంగా రాణిస్తోంది. టీమిండియాలో ముఖ్యంగా విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. అద్భుతమైన ఫామ్‌తో ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన సూర్య.. ఈ మెగా టోర్నీలో కూడా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. సూపర్-12 స్టేజ్‌లో చివరి మ్యాచ్‌లో జింబాబ్వేపై ధనాధన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.

సూపర్ ఫామ్‌లో సూర్య..
ప్రస్తుతం భారత జట్టులో ఎవరికీ అందనంత అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆటగాడు సూర్యకుమార్ యాదవ్. సౌతాఫ్రికా, జింబాబ్వే మ్యాచుల్లో అతను ఆడిన ఇన్నింగ్స్‌లు ఆయా మ్యాచుల్లో హైలైట్‌గా నిలిచాయి. ఈ టోర్నీలో మొత్తం ఐదు మ్యాచులు ఆడిన సూర్య.. 225 పరుగులు చేసి టాస్ స్కోరర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఇంత అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సూర్య.. ఇటీవలే ప్రపంచ నెంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా అవతరించిన సంగతి తెలిసిందే.

సెమీస్ చేరిన భారత్..
ప్రపంచకప్‌లో సూర్యకుమార్‌తోపాటు విరాట్ కోహ్లీ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా కేఎల్ రాహుల్ కూడా ఫామ్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే గ్రూప్ దశలో చివవరి రెండు మ్యాచుల్లో ఘన విజయాలు సాధించిన టీమిండియా.. గ్రూప్-2 టాపర్‌గా సెమీస్‌లో అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో కూడా సూర్యకుమార్ యాదవ్ చాలా కీలకం కానున్నాడు. ఇదే ఏడాది ఆరంభంలో పొట్టి ఫార్మాట్‌లో తన తొలి సెంచరీని ఇంగ్లండ్‌పైనే సూర్య చేయడం గమనార్హం.

అడ్డుకుంటామని ఆశిస్తున్నా..
ఈ క్రమంలో మ్యాచ్ ముందు మీడియాతో మాట్లాడిన ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్.. తాము సూర్యను అడ్డుకుంటామనే ఆశిస్తున్నానని అన్నాడు. 'సూర్య ఫెంటాస్టిక్ ఫామ్‌లో ఉన్నాడు. అతను ఆడే కొన్ని షాట్స్ చూస్తే బుర్ర గోక్కోవడం తప్పితే ఏం చెయ్యలేం. అయితే గురువారం నాడు అతన్ని అడ్డుకొని మాపై విరుచుకు పడకుండా ఆపుతామని అనుకుంటున్నా' అని బెన్ స్టోక్స్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications