Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్యాగు కొట్టేసిన దొంగ.. కోపంతో తిట్టిపోస్తున్న స్టార్ క్రికెటర్!

Ben Stokes got robbed in train station

స్టార్ క్రికెటర్లకు కూడా ఒక్కోసారి తిప్పలు తప్పవు. తాజాగా ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ విషయంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అతని బ్యాగును ఒక దొంగ ఎత్తుకెళ్లాడు. ఈ విషయాన్ని బెన్ స్టోక్స్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. లండన్‌లోని కింగ్స్ క్రాస్ రైల్వే స్టేషన్‌లో ఈ దొంగతనం జరిగిందట. ఈ విషయాన్ని వెల్లడించిన ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. సదరు దొంగకు శాపనార్థాలు పెట్టాడు.

తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిన బెన్ స్టోక్స్.. 'కింగ్స్ క్రాస్ ట్రైన్ స్టేషన్‌లో నా బ్యాగు ఎవరో కొట్టేశారు. నా బట్టలు నీకు మరీ పెద్దవి అయిపోవాలి' అంటూ ఆ దొంగను బూతులు తిట్టాడీ ఇంగ్లండ్ కెప్టెన్. ఈ విషయం తెలిసిన అభిమానులు కూడా సదరు దొంగపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ స్టార్ క్రికెటర్ బ్యాగు కొట్టేయడం ఏంటని? మండిపడుతున్నారు. అలాగే పోలీసులు వెంటనే కలుగజేసుకొని స్టోక్స్ బ్యాగును కొట్టేసిన దొంగను పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా, ఇటీవలే బంగ్లాదేశ్‌తో వన్డేలు, టీ20లు ఆడిన ఇంగ్లండ్ జట్టు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది. మరికొన్ని రోజుల్లో మొదలయ్యే ఐపీఎల్ 2023 కోసం ఈ ఆటగాళ్లంతా ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్‌లో బెన్ స్టోక్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా రూ.16.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అయితే స్టోక్స్ మోకాలి గాయంతో బాధ పడుతున్నాడు. దీంతో అతను ఐపీఎల్ ఆడతాడో లేడో అని అనుమానాలు నెలకొన్నాయి. దీనిపై స్పష్టత ఇచ్చిన స్టోక్స్ తను ఐపీఎల్ ఆడుతున్నట్లు ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. 2021 తర్వాత అతను ఆడుతున్న ఐపీఎల్ ఇది. ఆ ఏడాది తమ టెస్టు క్రికెట్‌లో జోష్ పెంచేందుకు ఐపీఎల్‌కు స్టోక్స్ దూరమయ్యాడు.

Story first published: Monday, March 13, 2023, 11:40 [IST]
Other articles published on Mar 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+