
చికిత్స కోసం ఆస్పత్రికి తరలించిన పోలీసులు
'బాధితుడిని చికిత్స కోసం ఆస్పత్రికి పంపించాం. ఈ ఘటనకు కారకుడిగా భావిస్తూ ఒక 26 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశాం. ప్రస్తుతం బెన్ స్టోక్స్‌ని విడుదల చేసినా విచారణ మున్ముందు కొనసాగుతుంది' అని పోలీసులు వెల్లడించారు.
మరోవైపు ఈ కేసులో నేరం రుజువైతే స్టోక్స్‌కు అక్కడి చట్టాల ప్రకారం కనీసం ఐదేళ్ల జైలు శిక్ష పడుతుంది.

నాలుగో వన్డే నుంచి తప్పించిన బోర్డు
విండీస్‌తో మూడో వన్డేలో ఇంగ్లండ్ విజయం అనంతరం సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. స్టోక్స్, హేల్స్ కోచింగ్ క్యాంప్‌కు హాజరు కాలేదంటూ ఈ ఘటనను నిర్ధారించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్ బుధవారం జరిగిన నాలుగో వన్డే నుంచి వీరిద్దరిని తప్పించిన సంగతి తెలిసిందే.

బయట పెట్టిన సన్ న్యూస్ పేపర్
ఈ వీడియోను సన్ న్యూస్ పేపర్ బయటపెట్టిన తర్వాతే తాము చూశామని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు చెప్పింది. నాలుగో వన్డేకు స్టోక్స్‌ను పక్కన పెట్టిన టీమ్ మేనేజ్‌మెంట్.. ఇప్పుడు ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు కూడా అతన్ని పక్కన పెట్టే ఆలోచనలో ఉంది. బుధవారం యాషెస్ సిరిస్ కోసం ఎంపిక చేసిన 16 మంది జట్టు సభ్యుల్లో బెన్ స్టోక్స్‌కు చోటు దక్కింది.
పునరాలోచనలో పడిన జట్టు మేనేజ్‌మెంట్
ఈ గొడవ సమయంలో స్టోక్స్ పక్కనే ఉన్న అలెక్స్ హేల్స్‌ను యాషెస్ సిరిస్‌కు ఎంపిక చేయలేదు. అయితే ఈ వీడియో బయటకు రావడంతో టీమ్ మేనేజ్‌మెంట్ పునరాలోచనలో పడింది. ఈ గొడవలో స్టోక్స్‌పై కేసు నమోదు కాకపోయినా.. విచారణ మాత్రం కొనసాగుతోంది. ప్రస్తుతానికి అతను వైస్ కెప్టెన్‌గా ఉన్నాడని, అయితే అది పోలీసులపై అతనిపై ఎలాంటి చర్య తీసుకోనంత వరకే అని ఈసీబీ డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్ స్పష్టంచేశాడు.


Click it and Unblock the Notifications











