
హైదరాబాద్: ఎంతటి స్టార్ బ్యాట్స్ మెన్ అయితే మాత్రం ఏముంది. ఫుల్లుగా తాగి క్లబ్‌లో గొడవ పెట్టుకున్నాడు. దీంతో జరిగిన వివాదం కాస్తా 'చిలికి చిలికి గాలి వాన' అయినట్లుగా పెద్ద దుమారం అయింది. ఆ విషయం తెలిసుకున్న జట్టు యాజమాన్యం మ్యాచ్‌కు ఆడకూడదు అంటూ నిషేదాన్ని విధించింది.
అక్కడితో అతనితో పాటు అతని అభిమానులు సైతం నిరుత్సాహానికి గురైయ్యారు. అయితే ఇప్పుడు వాళ్లందరికీ ఇధి శుభవార్తే. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ తిరిగి ఇంగ్లాండ్ జట్టు తరఫున ఆడనున్నాడు. అతడి ఎంపికకకు లైన్ క్లియర్ అయ్యింది.
జట్టు ఎంపికలో స్టోక్స్ పేరును పరిగణించాలని నిర్ణయించినట్లు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. దీనికి స్పందించిన బెన్ 'కుటుంబ సభ్యులకే కాదు. స్నేహితులకు, అభిమానులకు అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు, నేను తిరిగి జట్టులో ఆడాలని చాలా తాపత్రయపడ్డాను. అది ఇప్పటికీ నెరవేరింది.' 'దేశానికి ప్రాతినిథ్యం వహించడం అనేది చాలా గొప్ప విషయం. నేను చాలా అదృష్టవంతుడిని. మరోసారి ఇంగ్లాండ్ జెర్సీ ధరించి మైదానంలో అడుగుపెట్టబోతున్నా. చాలా సంతోషంగా ఉంది. నా ఛాతీపై మూడు సింహాలు ఉన్న జెర్సీని ధరించి తిరిగి ఫీల్డ్‌లోకి అడుగుపెట్టేందుకు ఆశగా ఎదురుచూస్తున్నా. ఎంతో గర్వంగా ఉంది' అని స్టోక్స్ పేర్కొన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.