న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అరే ఏంట్రా ఇది..! అసలు దానికి దీనికి ఏమన్న సింక్ ఉందా? మధ్యలో నన్నెందుకు లాగుతార్రా.. బెన్ స్టోక్స్ పరేషాన్

Ben Stokes Cryptic Tweet Regarding A comparison his 2019 Boundary with Deepti Sharmas Mankad

ఇటీవల ఇండియా వుమెన్ వర్సెస్ ఇంగ్లాండ్ వుమెన్ వన్డే సిరీస్‌లో దీప్తి శర్మ వివాదాస్పద రీతిలో ఛార్లీ డీన్‌ను (మన్కడింగ్) రనౌట్ చేసిన ఘటన పెను దుమారం రేపింది. ఇంగ్లీష్ మీడియా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ పోస్టులు కుమ్మరించగా.. భారత నెటిజన్లు సోషల్ మీడియాలో దీప్తిని సపోర్ట్ చేస్తూ కామెంట్లు, పోస్టులు హోరెత్తిస్తున్నారు.

గతంలో ఇంగ్లాండ్ ప్లేయర్లు చేసిన తప్పిదాలను కూడా పోస్టు చేస్తూ అప్పట్లో మీరు చేసిన దానితో పోల్చితే ఇది వంద రెట్లు క్రీడాస్ఫూర్తికి సంబంధించినదే అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ ప్లేయర్ అమీజోన్స్ క్యాచ్ మిస్ చేసి ఔటయినట్లు సెలెబ్రేట్ చేసుకోవడం, ఇంగ్లాండ్ బౌలర్ మన్కడింగ్‌కు ప్రయత్నించడం తదితర వీడియోలు కూడా పోస్టు చేస్తూ ఇంగ్లాండ్ క్రీడాస్ఫూర్తిని ఏకి పారేస్తున్నారు.

అసలు ఏమన్న సింక్ అవుతుందా?

ఇందులో 2019వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో బెన్ స్టోక్స్ వీడియోపై కూడా కామెంట్లు వస్తున్నాయి. ఫైనల్లో అతను నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు పరిగెత్తుతుండగా.. ఫీల్డర్ త్రో బ్యాట్‌కు తాకి బంతి బౌండరీ వైపు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో హైడ్రామా నడిచిన ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ సూపర్ ఓవర్లో చివరికి గెలుపొందింది. అయితే.. స్టోక్స్ నాన్ స్టైకర్ ఎండ్లో రన్ చేసేటప్పుడు బంతి బ్యాట్‌ను తాకి బౌండరీ వెళ్లిపోవడాన్ని ఏమంటారు అంటూ కొందరు దీప్తి శర్మ మన్కడింగ్‌తో పోల్చుతూ ట్వీట్ చేస్తున్నారు. దీనిపై బెన్ స్టోక్స్ కూడా స్పందించాడు. అసలు మన్కడింగ్‌కు, 2019లో జరిగిన ఆ బౌండరీకి ఏమన్న సింక్ ఉందా అంటూ ట్వీట్ చేశాడు. ఇలాంటి పోస్టులు చేయడం పట్ల ఆశ్చర్యపోయాడు. దీనికి సంబంధించి ఓ మీమ్ కూడా పోస్ట్ చేశాడు. స్టోక్స్ ట్వీట్ చూస్తుంటే.. అరే ఏంట్రా ఇది.. మధ్యలో నన్నెందుకు లాగుతున్నార్రా అన్నట్టుంది.

స్పష్టతనిచ్చిన దీప్తి

దీప్తి శర్మ మన్కడింగ్ విధానంలో రనౌట్ చేసిన విషయమై ఓ స్పష్టతనిచ్చింది. ముందే చార్లీ డీన్‌కు తాను వార్నింగ్ ఇచ్చానని, అంపైర్లకు కూడా ఈ విషయమై సమాచారం అందించానని భారత క్రికెటర్ దీప్తి శర్మ స్పష్టం చేసింది. 40పరుగులు చేసిన ఛార్లీ డీన్ చివరి వికెట్‌గా ఔటవ్వడంతో భారత్ 16పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక ఇదే మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్ నుండి ఝులన్ గోస్వామి రిటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే.

ఎంత చెప్పినా వినకుండా ముందుకెళ్తూనే ఉంది

'ఇది మా ప్రణాళికలో ఒక భాగం. ఎందుకంటే ఆమె క్రమం తప్పకుండా క్రీజు నుంచి బయటికొస్తుంది. బాల్ వేయకముందే అలా ఎలా ముందుకెళ్తావ్ అని మేము అప్పటికే ఆమెను హెచ్చరించాం. మేము నిబంధనలనే పాటించే ఔట్ చేశాం.'అని దీప్తి పేర్కొంది. 'ప్రతి జట్టు ఫీల్డ్‌లో గెలవాలని కోరుకుంటుంది. ఈ మ్యాచ్ మేం గెలవడం ద్వారా ఝులన్ గోస్వామికి ఘన వీడ్కోలు ఇచ్చినట్లయింది. జట్టుగా మేం చేయగలిగినదంతా చేశాం. ఇక రనౌట్ విషయంలో మేము అంపైర్లకు ముందే సమాచారం అందించాం, కానీ ఆమె అవేమీ పట్టించుకోకుండా క్రీజులో ముందుకు వెళ్తూనే ఉంది. ఇక మేం ఏం చేస్తాం చెప్పండి. అందుకే ఔట్ చేశా' అని దీప్తి భారత్‌కు తిరిగి వచ్చాక విలేకరులతో తెలిపింది.

Story first published: Tuesday, September 27, 2022, 8:49 [IST]
Other articles published on Sep 27, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X