Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇబ్బందిగా ఉంది: ప్లింటాఫ్‌తో పోల్చడంపై బెన్ స్టోక్స్

హైదరాబాద్: తనని ఆండ్రూ ప్లింటాఫ్‌తో పోల్చడంపై ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ తన ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఇంగ్లాండ్‌కి చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.

ది ఓవల్ వేదికగా జరిగిన మూడో టెస్టులో బెన్ స్టోక్స్ సెంచరీ చేయడంతో పాటు బంతితో కూడా రాణించి మూడు వికెట్లతో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌'గా నిలిచాడు. ఈ టెస్టు ముగిసిన అనంతరం స్టువర్ట్ బ్రాడ్ మీడియాతో మాట్లాడుతూ 'బెన్‌స్టోక్స్ పదునైన బౌలింగ్ ప్లింటాఫ్‌ని గుర్తుకు తెచ్చింది' అని వ్యాఖ్యానించాడు.

Ben Stokes: Comparison with Andrew Flintoff uncomfortable

ఈ వ్యాఖ్యలపై మీడియాతో పాటు అభిమానులు ఒకింత అసహనానికి గురవడంతో బెన్ స్టోక్స్ తనదైన శైలిలో బదులిచ్చాడు. 'నా ఆటతీరు గురించి పోలికలు వచ్చిన ప్రతిసారి నేను చెప్పేది ఒకటే. నేను ఎవరినీ అధిగమించాలని భావించట్లేదు. గత ప్రదర్శన కంటే.. మెరుగ్గా ఆడాలని ప్రయత్నిస్తుంటా' అని స్టోక్స్ చెప్పాడు.

'గతంలో ఇంగ్లాండ్ తరఫున ప్లింటాఫ్ అద్భుతమైన ప్రదర్శనతో ఒక ట్రెండ్‌ని సెట్ చేశాడు. ఇప్పుడు అందరూ అతడితో నన్ను పోలస్తుంటే ఇబ్బందిగా ఉంది. వారికి ఏం చెప్పాలో నాకు అర్థంకావడం లేదు' అని బెన్‌స్టోక్స్ ఆవేదన వ్యక్తం చేశాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా, చివరి టెస్టు శుక్రవారం ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ప్రారంభం కానుంది.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+