Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భయానికి మీనింగే తెలియని టీం మాది, రాసిపెట్టుకోండి.. మేం టెస్ట్ క్రికెట్‌ను తిరగరాస్తున్నాం : స్టోక్స్

Ben Stokes Clarified that they Gonna rewrite how Test cricket is played in England

రీషెడ్యూల్ చేసి అయిదో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో విధించిన 378పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఉఫ్ మని ఊదేసి వరుసగా నాలుగు టెస్టులు గెలిచిన సంగతి తెలిసిందే. అంతకుముందు న్యూజిలాండ్ మీద మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లాండ్.. అదే ఉత్సాహంతో ఇండియాను కూడా ఓడించింది. ఫియర్‌లెస్ క్రికెట్‌ అనే కొత్త బ్రాండింగ్ క్రికెట్ ఆడుతున్న ఇంగ్లాండ్.. పడి లేచిన కెరటంలా టెస్ట్ క్రికెట్లో ఓ ట్రెండ్ సెట్ చేస్తోంది. టెస్ట్ క్రికెట్లో చివరి ఇన్నింగ్స్‌లో 250కంటే ఎక్కువ లక్ష్యాలను వరుసగా నాలుగుసార్లు ఛేదించిన తొలి జట్టుగా అవతరించింది.

ఇంగ్లాండ్ జట్టులో జానీ బెయిర్ స్టో, జో రూట్ భీకర ఫాంలో ఉన్నారు. ఇక టెస్ట్ క్రికెట్‌కు కొత్త జవసత్వాలు తీసుకురావాలని, టెస్ట్ క్రికెట్ అంటే బోర్ అనే ఫీల్ పోయి జోరుకు తేవాలని, మరింత మందిని టెస్ట్ క్రికెట్ అభిమానులుగా మార్చాలని, వచ్చిన ప్రేక్షకులకు వీలయినంత సేపు ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వాలని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కంకణం కట్టుకున్నాడు. అందుకు తగ్గట్టే టీం మునుపెన్నడూ లేనంత ఫియర్ లెస్ గేమ్ ఆడుతుంది. ఇక ఇది ఆ టీంకు వర్కౌట్ కావడం కూడా గమనార్హం. ఇక సిరీస్‌ను 2-2తో సమం చేసిన అనంతరం బెన్ స్టోక్స్ తమ ప్లాన్స్ గురించి వివరించాడు.

అయిదు వారాల క్రితం వామ్మో.. ఇప్పుడు ఉఫ్

అయిదు వారాల క్రితం వామ్మో.. ఇప్పుడు ఉఫ్

మ్యాచ్ ప్రెజెంటేషన్ సందర్భంగా విన్నింగ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. 'మా వాళ్లు ఇలా ఆడినప్పుడు.. నా పని సులభమవుతుంది. గ్రౌండ్లో ఎలా ఆడాలో మేము డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా స్పష్టంగా ముందే చర్చించుకుంటాం. దాన్నే ఫాలో అవుతాం. మధ్యలో ఎలాంటి డౌట్స్ ఉండవు. అందువల్లే.. ఇలాంటి భారీ టార్గెట్లను కూడా ఛేజింగ్ చేయగలుగుతున్నాం. అయిదు వారాల క్రితం 378స్కోరు ఛేదించడం అంటే వామ్మో అనేలా ఉండేది పరిస్థితి. ఇప్పుడు అదంత పెద్ద మ్యాటరేం కాదన్నట్లు ఉంది మాకు. ' అని స్టోక్స్ చెప్పాడు.

ఇన్నింగ్స్‌లో కచ్చితంగా పది వికెట్లు తీయాలి

ఇన్నింగ్స్‌లో కచ్చితంగా పది వికెట్లు తీయాలి

'ఈ రోజు మేం గెలిచామంటే.. ఈ క్రెడిట్ జానీకి, రూట్‌కు దక్కుతుంది. ముఖ్యంగా మా ఓపెనర్లు క్రాలీ, లీస్ కొత్త బంతితో బుమ్రా, షమీ లాంటి బౌలర్లను ఎదుర్కొన్న విధానం ఆకట్టుకుంది. వాళ్లు ఈ మ్యాచ్‌లో మేం నిలదొక్కుకోవడానికి ఓ పాథ్ వేశారు. మా ప్రధాన లక్ష్యాల్లో ఒకటి వికెట్లు తీయడం. కచ్చితంగా పది వికెట్లు తీయాలనేది మా ప్రధాన ఎజెండా. దాంట్లో ఎలాంటి కంప్లయిన్లకు ఆస్కారం లేదు. ఇకపోతే మొన్నమధ్య మావోడు జాక్ లీచ్ అన్నట్లు.. కొన్ని జట్లు మా కంటే మెరుగ్గా ఉన్నాయి. కానీ మా కన్న ధైర్యంగా మాత్రం ఏ జట్టు ఉండదు. అది మా ఫియర్ లెస్ట్ క్రికెట్. భయానికి మీనింగ్ తెలియకుండా ఆడాలి అంతే. టెస్ట్ క్రికెట్ స్వరూపాన్ని రిరైట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.' అని స్టోక్స్ పేర్కొన్నాడు.

కొత్త అభిమానులను తీసుకురావాలని..

కొత్త అభిమానులను తీసుకురావాలని..

'గత నాలుగు-ఐదు వారాల నుంచి మా ప్లాన్లు ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాము. మాకు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశామన్నది ముఖ్యం కాదు.. పది వికెట్లు తీయడమే మాకు ముఖ్యం. ఇక టెస్టు క్రికెట్‌కు కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. మాకు ఈ క్రమంలో లభిస్తున్న మద్దతు నిజంగా అద్భుతమైనది. రేపటి తరానికి స్ఫూర్తినివ్వడమే మేం చేయాలనుకుంటున్నాం. మేము టెస్ట్ ఆట కోసం కొత్త అభిమానులను తీసుకురావాలనుకుంటున్నాము. టెస్ట్ క్రికెట్‌లో ఒక చెరిగిపోని ముద్ర వేయాలనుకుంటున్నాము.' అని స్టోక్స్ పేర్కొన్నాడు.

Story first published: Tuesday, July 5, 2022, 20:10 [IST]
Other articles published on Jul 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+