Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీలకు పెద్ద అభిమానిని'

Ben Stokes calls himself a fan of both Steve Smith and Virat Kohli’s batting styles

హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్‌లు దిగ్గజ ఆటగాళ్లుగా కీర్తింపబడుతున్నారు. ప్రస్తుత మూమెంట్‌లో ఈ నలుగురు ప్రపంచ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. రాబోయే వరల్డ్‌కప్‌లో ఈ నలుగురూ తమ తమ జట్ల విజయాల్లో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

అటు అభిమానులతో పాటు మిగతా జట్లలోని ఆటగాళ్లు సైతం వీరిని లక్ష్యంగా చేసుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్ ఆరంభం కానున్న నేపథ్యంలో విరాట్‌ కోహ్లీ, స్టీవ్‌ స్మిత్‌లపై ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ దిగ్గజ ఆటగాళ్లకు తాను పెద్ద అభిమానిని బెన్ స్టోక్స్‌ చెప్పాడు.

స్టోక్స్ మాట్లాడుతూ

స్టోక్స్ మాట్లాడుతూ

ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో బెన్ స్టోక్స్ మాట్లాడుతూ "కోహ్లీ, స్మిత్‌ అద్భుతమైన ఆటగాళ్లు. ఎన్నోసార్లు ప్రత్యర్థులుగా తలపడ్డారు. వీరి ఆటను గమనిస్తే మిగతా ఆటగాళ్ల కన్నా ఎంతో సులభంగా ఆటను తమవైపుకి తిప్పుకుంటారు. వారిద్దరి బ్యాటింగ్‌ శైలి భిన్నమే... కానీ గెలుపు కోసమే ఆడతారు" అని అన్నాడు.

కోహ్లీ, స్మిత్ క్రికెట్‌ ఆడటాన్ని చూసి ఆస్వాదిస్తా

కోహ్లీ, స్మిత్ క్రికెట్‌ ఆడటాన్ని చూసి ఆస్వాదిస్తా

కోహ్లీ, స్మిత్ క్రికెట్‌ ఆడటాన్ని చూసి ఆస్వాదిస్తానని... వారికి నేను పెద్ద అభిమాని అని బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు. ఇక, ఇంగ్లాండ్ జట్టు గురించి స్టోక్స్‌ మాట్లాడుతూ "గత మూడు, నాలుగేళ్లుగా మా క్రికెట్‌తో ప్రపంచకప్‌నకు మేం ఫేవరెట్‌గా గుర్తింపుపొందాం. ప్రపంచ నెంబర్ వన్ జట్టంటే అన్ని టోర్నీల్లోనూ ఫేవరెట్‌గానే అడుగుపెడుతుంది" అని తెలిపాడు.

అప్పటితో పోలిస్తే ఇప్పుడు మెరుగయ్యాం

అప్పటితో పోలిస్తే ఇప్పుడు మెరుగయ్యాం

"ఆస్ట్రేలియా, భారత్‌ కూడా చక్కటి ఫామ్‌లో ఉన్నాయి. ఈ మెగా టోర్నీలో గెలవాలనే బరిలోకి దిగుతున్నాం. 2017 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాక్‌తో మ్యాచ్‌లో రూపొందించిన వికెట్‌ మా క్రికెట్‌ శైలికి అనుకూలంగా లేదు. దీంతో ఆ ఓటమి నుంచి మేం నేర్చుకొని అలాంటి పరిస్థితుల్లో ఎలా ఆడాలో తెలుసుకున్నాం. అప్పటితో పోలిస్తే ఇప్పుడు మెరుగయ్యాం" అని స్టోక్స్‌ అన్నాడు.

Story first published: Tuesday, May 21, 2019, 12:36 [IST]
Other articles published on May 21, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+