For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేను నీకు వీరాభిమానిని: స్టోక్స్

 Ben Stokes Calls Alastair Cook His Favourite Player

హైదరాబాద్: అతనొక సాధారణ ఆటగాడు కాదు. యాషెస్ సిరీస్‌లో ఇది ఒక అద్ఢుతమైన రికార్డు. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న కుక్ బ్యాటింగ్‌కు స్పందించిన స్టోక్స్ మాటలివి. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ అలెస్టర్‌ కుక్‌ డబుల్‌ సెంచరీ సాధించాడు.

డబుల్ సెంచరీపై స్టోక్స్ స్పందించాడు. ఏకంగా నీకు నేను ఫ్యాన్ అంటూ పొగిడేస్తున్నాడు. 'నువ్వే నా ఫేవరేట్‌ ప్లేయర్‌' అంటూ ట్విటర్‌లో పేర్కొన్నాడు. ఇంతకుముందు జరిగిన ఒక దుష్పరిణామంతో స్టోక్స్ యాషెస్ సిరీస్ కు దూరమైయ్యాడు.

ఒక వ్యక్తిపై దాడి కేసులో విచారణ కారణంగా యాషెస్‌కు దూరమైన స్టోక్స్‌ యాషెస్‌ నాల్గో టెస్టులో ఇంగ్లండ్‌ ప్రదర్శనను కొనియాడాడు. ప్రధానంగా కుక్‌ ఆటను కొనియాడిన స్టోక్స్‌.. అతనే తన ఫేవరేట్‌ ఆటగాడని మనసులో మాటను వెల్లడించాడు.

104 ఓవర్‌ నైట్‌ వ్యక్తిగత స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన కుక్‌ మరో వంద పరుగులు సాధించి తన కెరీర్‌లో ఐదో ద్విశతకాన్ని సాధించాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తొమ్మిది వికెట్లు కోల్పోయి 491 పరుగులు చేసింది.

ఆట ముగిసేసమయానికి కుక్‌(244 బ్యాటింగ్‌;409 బంతుల్లో 27 ఫోర్లు), అండర్సన్‌(0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 164 పరుగుల ఆధిక్యంలో ఉంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 28, 2017, 17:00 [IST]
Other articles published on Dec 28, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+