Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

4000 పరుగులు, 100 వికెట్లు: 6వ ఆల్‌రౌండర్‌గా బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు

Ben Stokes Becomes 6th Player in Test History To Get 4000 Runs and 100 Wickets

హైదరాబాద్: పోర్ట్ ఎలిజబెత్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 4000 పరుగులు, 100 వికెట్లు పడగొట్టిన ఆరవ ఆల్ రౌండర్‌గా గుర్తింపు పొందాడు. గురువారం ప్రారంభమైన ఈ టెస్టులో బెన్ స్టోక్స్ సెంచరీ సాధించాడు.

214 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో బెన్ స్టోక్స్ 120 పరుగులు చేశాడు. టెస్టుల్లో బెన్ స్టోక్స్‌కు ఇది 8వ సెంచరీ కావడం విశేషం. కాగా, టెస్టు క్రికెట్‌లో 4000 పరుగులు, 100 వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలో గ్యారీ ఫీల్డ్ సోబర్స్(93 టెస్టుల్లో 8032 పరుగులు, 235 వికెట్లు) ముందు వరుసలో కొనసాగుతున్నాడు.

కపిల్ దేవ్(131 టెస్టుల్లో 5248 పరుగులు, 434 వికెట్లు), ఇయాన్ బోథమ్(102 టెస్టుల్లో 5200 పరుగులు, 383 వికెట్లు), జాక్వస్ కల్లిస్(166 టెస్టుల్లో 13,289 పరుగులు, 292 వికెట్లు), డానియేల్ వెటోరి(113 టెస్టుల్లో 4531 పరుగులు, 362 వికెట్లు), బెన్ స్టోక్స్(62 టెస్టుల్లో 4014 పరుగులు, 142 వికెట్లు) ఈ జాబితాలో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

కాగా, మూడో టెస్టులో బెన్ స్టోక్స్ సెంచరీ సాధించడంతో మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆల్ రౌండర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. బీఫీ బోథమ్(5200) పరుగులతో అగ్రస్థానంలో ఉండగా... బెన్ స్టోక్స్(4025) రెండో స్థానంలో నిలిచాడు.

ఆండ్రూ ఫ్లింటాప్(3795), టోనీ గ్రెగ్(3599), ఫ్రాంక్ వూలీ(3283) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక, బెన్ స్టోక్స్ టెస్టు బ్యాటింగ్ యావరేజి దేశాల వారీగా పరిశీలిస్తే దక్షిణాఫ్రికా(63.45), ఇండియా(38.33), వెస్టిండిస్(36.20), న్యూజిలాండ్(35.42), ఆస్ట్రేలియా(34.87), బంగ్లాదేశ్(32.00), శ్రీలంక(31.16)గా నమోదైంది.

Story first published: Friday, January 17, 2020, 17:46 [IST]
Other articles published on Jan 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+