Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డుని గెలుచుకున్న బెన్ స్టోక్స్

Ben Stokes bags Professional Cricketers Association award

హైదరాబాద్: ప్రొఫెషనల్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌ (పీసీఏ) ప్రతి ఏటా అందించే 'ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డును ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ గెలుచుకున్నాడు. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించడం... యాషెస్ టెస్టు సిరిస్‌ను సమం చేయడంలో బెన్ స్టోక్స్‌ పాత్ర మరువలేనిది.

ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో భాగంగా హెడెంగ్లే వేదిక జరిగిన మూడు టెస్టులో బెన్ స్టోక్స్ 135 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఇంగ్లాండ్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించి యాషెస్ ఆశలను సజీవంగా ఉంచాడు. అయితే, నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ ఓడటం... ఐదో టెస్టు డ్రాగా ముగియడంతో ఆస్ట్రేలియా 2-2తో ట్రోఫీని సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలో బెన్ స్టోక్స్ 'ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డును కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా బీబీసీ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్యూలో బెన్ స్టోక్స్ మాట్లాడుతూ "పీసీఏ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు అందుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. వ్యక్తిగతంగా ఎంతో గర్వంగా కూడా ఉంది. జట్టు నాకు అండగా నిలిచినందుకే ఈ అవార్డును అందుకున్నాను" అని తెలిపాడు.

"ఒక టీమ్‌గా ఏదైతో సాధించామో అది 2019లో ఎంతో ప్రత్యేకమైంది. వరల్డ్‌కప్ నెగ్గడంతో పాటు యాషెస్ సిరీస్‌ను సమం చేశాం. ఈ సమ్మర్ ఎంతో అద్భుతంగా గడిచింది. వ్యక్తిగతంగా నాకెంతో గర్వంగా ఉంది" అని బెన్ స్టోక్స్ తెలిపాడు. కాగా, పీసీఏ సమ్మర్‌ వన్డే ప్లేయర్‌గా క్రిస్ వోక్స్‌, టెస్టు ప్లేయర్‌గా స్టువర్ట్‌ బ్రాడ్‌, కౌంటీ ఛాంపియన్‌షిప్‌ ప్లేయర్‌గా హార్మర్‌, ఉమెన్ ప్లేయర్‌గా సోఫీ ఎక్లెస్టన్‌ ఎంపికయ్యారు.

Story first published: Thursday, October 3, 2019, 15:01 [IST]
Other articles published on Oct 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+