ఆ బాధ తెల్సు, యువీ చుక్కలు చూపాడు: 4 సిక్స్‌లిచ్చిన స్టోక్స్‌పై జాలి
కోల్‌కతా: ట్వంటీ 20 ప్రపంచ కప్ ఫైనల్లో వెస్టిండీస్‌తో జరిగి పోరులో ఇంగ్లాండ్ బౌలర్ బెన్ స్టోక్స్ చివరి ఓవర్లో తొలి నాలుగు బంతుల్లో నాలుగు సిక్స్‌లు ఇచ్చాడు. చివరి ఓవర్లో విండీస్ 19 పరుగులు చేయాల్సిన స్థితిలో.. స్టోక్స్ చివరి ఓవర్ వేశాడు.
అయితే, వరుస నాలుగు బంతుల్లో విండీస్ ప్లేయర్ బ్రాత్‌వైట్ సిక్స్‌లు కొట్టాడు. మరో రెండు బంతులు ఉండగానే నాలుగు సిక్సులతో మొత్తం 24 పరుగులు చేశాడు. 19 పరుగులకు గాను 24 పరుగులు వచ్చాయి. దీంతో విండీస్ కప్ గెలిచింది. తన బౌలింగ్ వల్లే కప్ ఓడిపోయామన్న వేదనతో ఇంగ్లాండ్ బౌలర్ స్టోక్స్‌ను వెంటాడుతోంది.
తన బౌలింగులో వరుసగా నాలుగు సిక్సులు కొట్టగానే స్టోక్స్.. మైదానంలో కంటతడి పెట్టి కింద కూర్చున్నాడు. మ్యాచ్ పూర్తయి మూడు రోజులు గడుస్తున్నా అతను ఇంకా తేరుకోనట్లుగా ఉంది. తన వల్లే మ్యాచ్ పోయిందన్న ఆవేదన అతనిని కలచివేస్తోంది.

బెన్ స్టోక్స్
ఈ నేపథ్యంలో అతనిని ఎందరో ఆటగాళ్లు ఊరడిస్తున్నారు. సొంత జట్టు ఆటగాళ్లతో పాటు, ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు, ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్, న్యూజిలాండ్.. ఇలా అన్ని దేశాల ఆటగాళ్లు అతనిని ఊరడిస్తున్నారు. స్టువార్ట్ బ్రాడ్ కూడా అతనిని ఊరడించారు.

స్టువార్ట్ బ్రాడ్
స్టోక్స్‌కు అండగా నిలబడ్డాడు. గతంలో యువరాజ్ సింగ్ తన బౌలింగులో ఇలాగే బాధాడని, ఆ బాధ తనకు తెలుసునని, కానీ బాధను తొందరగా మర్చిపోవాలని బ్రాడ్.. స్టోక్స్‌కు మద్దతుగా నిలబడ్డాడు. స్టువార్ట్ బ్రాడ్‌తో పాటు చాలామంది ఆటగాళ్లు, మాజీలు స్టోక్స్ పైన సానుభూతి చూపిస్తున్నారు.

బ్రాత్‌వైట్
స్టోక్స్ చివరి ఓవర్లో నాలుగు సిక్స్‌లు కొట్టిన విండీస్ ఆటగాడు బ్రాత్‌వైట్ కూడా ఊరడించే ప్రయత్నం చేశాడు. క్రికెట్ ఇదంతా మామూలేనని, బాధ నుంచి తేరుకోవాలని సూచించాడు.

ఇంగ్లాండ్ జట్టు
అంతేకాదు, ఇంగ్లాండ్ ఆటగాళ్లు, ఇతరులు.. స్టోక్స్‌ను విండీస్ ఓటమి నుంచి మరిపించేందుకు అతనితో సెల్ఫీలు దిగి ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. చేదును మర్చిపోవాలని, ఓటమిని త్వరగా మర్చిపోవాలని సూచించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications