ఆ పరుగులు మాకొద్దు!: అంపైర్ వద్దకు వెళ్లి బెన్ స్టోక్స్ క్రీడాస్ఫూర్తి

హైదరాబాద్: తన బ్యాట్‌కి తగిలి బంతి బౌండరీని తాకడం ద్వారా అదనంగా లభించిన నాలుగు పరుగులను స్కోరు బోర్డు నుంచి తొలగించాల్సిందిగా బెన్ స్టోక్స్ ఫీల్డ్ అంఫైర్లను కోరినట్లు ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తెలిపాడు. జులై 14న లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకూ కివీస్‌కే విజయావకాశాలు ఉన్నప్పటికీ, మార్టిన్ గుప్టిల్ వేసిన ఓవర్‌త్రో మ్యాచ్‌నే మలుపు తిప్పింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఒకరకంగా చెప్పాలంటే ఈ సంఘటనే ఇంగ్లాండ్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచేందుకు దోహదపడింది. ఈ సంఘటనపై ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ మాట్లాడుతూ "ఫీల్డర్ బంతిని స్టంప్స్ వైపుకి విసిరిన సందర్భంలో బంతి బ్యాట్స్‌మెన్‌కు తగిలి మైదానంలోని గ్యాప్‌లోకి వెళితే పరుగు తీయం" అని బీబీసీకి ఇచ్చిన ఇంటర్యూలో అన్నాడు.

బంతి బౌండరీని తాకితే రూల్ ప్రకారం
"అదే బంతి బౌండరీని తాకితే రూల్ ప్రకారం అంఫైర్ బౌండరీగానే ప్రకటిస్తాడు. ఈ విషయంలో మనం ఏమీ చేయలేం. అదే బంతి నేరుగా బౌండరీకి చేరితే నిబంధనల ప్రకారం నాలుగు పరుగులు వస్తాయి. మైకెల్ వాన్‌తో మాట్లాడినప్పుడు నాకీ విషయం తెలిసింది. బెన్ స్టోక్స్ అంఫైర్ వద్దకు వెళ్లి 'అదనంగా వచ్చిన నాలుగు పరుగులను తొలగించండి, ఆ పరుగులు మాకొద్దు' అని చెప్పినట్లు తెలిపాడు. కానీ నిబంధనల్లో అలా ఉంది మరి. ఐతే బ్యాట్స్‌మన్‌కు బంతి తగిలి బయటకు వెళితే డెడ్‌బాల్‌గా పరిగణించాలని చాలా రోజులుగా ఆటగాళ్లు మాట్లాడుకుంటున్నారు" అని ఆండర్సన్ అన్నాడు.

అసలేం జరిగింది?
కివీస్ నిర్దేశించిన విజయ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇంగ్లండ్‌కు చివరి ఓవర్‌లో.. ఓవర్‌త్రో రూపంలో ఆరు పరుగులు వచ్చాయి. ఇదే, న్యూజిలాండ్ ఓటమికి కారణమైంది. ఇంగ్లాండ్ విజయానికి ఆఖరి ఓవర్ చివరి మూడు బంతులకు గాను 9 పరుగులు అవసరమయ్యాయి. అప్పుడు ట్రెంట్‌బౌల్ట్ బౌలింగ్ చేయగా బెన్‌స్టోక్స్ డీప్ మిడ్ వికెట్ దిశగా బాది రెండు పరుగులు తీశాడు.

రెండో పరుగును కోసం ప్రయత్నించి
రెండో పరుగును కోసం ప్రయత్నించిన సమయంలో బెన్ స్టోక్స్ కీపర్ ఎండ్‌కు వెళ్తూ రనౌట్ నుంచి తప్పించుకోవడానికి క్రీజులోకి డైవ్ చేశాడు. న్యూజిలాండ్ ఫీల్డర్ నుంచి వచ్చిన బంతి స్టోక్స్‌కు తగిలి బౌండరీకి తరలింది. దీంతో ఆ బంతికి మొత్తం ఆరు పరుగులు వచ్చాయి. స్టోక్స్, రషీద్ చేసిన 2 పరుగులతో కలిపి అంపైర్ ధర్మసేన దానిని 6 పరుగులుగా ప్రకటించాడు.

సూపర్ ఓవర్ కూడా టైగా!
దీంతో ఇంగ్లాండ్ సైతం నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఈ సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అనంతరం 16 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ సైతం ఆరు బంతుల్లో వికెట్ నష్టపోయి అదే 15 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ కూడా టై అయింది. చివరకు బౌండరీలు ఆధారంగా ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications